
సెక్యూరిటీ సిబ్బంది భద్రతపై ఫోకస్
గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం దృష్టి సారించింది. రాబోయే వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసింది. ఈమేరకు అన్ని ఏరియాల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెక్యూరిటీ పోస్టుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేలా చల్లటి మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలని, చెక్‌పోస్టులు మరమ్మతు చేయాలని వారు ఆదేశించారు. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని సెక్యూరిటీ పోస్టుల పైకప్పును చాపలతో కప్పాలన్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను అవసరం మేరకు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
వేసవిలో జాగ్రత్తలపై సింగరేణి దిశానిర్దేశం
అప్రమత్తంగా ఉండాలి
సిబ్బంది భద్రత కోసం యాజమాన్యం చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాలతో కాలక్షేపం చేయకుండా చుట్టుపక్క ప్రాంతాలపై దృష్టి సారించాలి. దొంగతనాల నివారణలో సెక్యూరిటీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలి. సంస్థ ఆస్తుల పరిరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
– లక్ష్మీనారాయణ,
సెక్యూరిటీ జీఎం, సింగరేణి

సెక్యూరిటీ సిబ్బంది భద్రతపై ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment