
అందరూ సుభిక్షంగా ఉండాలి
పెద్దపల్లిరూరల్: ఎల్లమ్మదేవత ఆశీర్వాదంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే విజయరమణారావు ఆకాంక్షించారు. మారేడుగొండలో బుధవారం నిర్వహించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ, గౌడకులస్తుల కులదైవం అనుగ్రహంతో అందరూ చల్లంగా ఉండాలన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత నూతన డయాగ్నోసిస్ సెంటర్‌ను ప్రారంభించారు.
రవాణా సౌకర్యం మరింత మెరుగు
ఓదెల(పెద్దపల్లి): రోడ్ల నిర్మాణంతో గ్రామస్తులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక రైల్వేగేట్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, ఓదెల మల్లన్నగుడి – అబ్బిడిపల్లి వరకు చేపట్టిన బీటీ రోడ్డుతోపాటు పలు లింక్‌రోడ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లెవాసులకు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రోడ్లు ని ర్మిస్తున్నామని తెలిపారు. పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, నాయకులు చీకట్ల మొండయ్య, ఆకుల మహేందర్, బొడకుంట చిన్నస్వామి, తీర్థాల వీరన్న పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment