వేధింపులకు గురిచేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

వేధింపులకు గురిచేస్తే చర్యలు

Published Fri, Feb 14 2025 10:28 PM | Last Updated on Fri, Feb 14 2025 10:23 PM

వేధిం

వేధింపులకు గురిచేస్తే చర్యలు

కరీంనగర్‌క్రైం: యువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్‌ 8712670759 లేదా డయల్‌ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్‌ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు కాగా, గతేడాది 40 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లోకేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం.

– శ్రీలత, ఉమెన్‌ టౌన్‌ సీఐ,

షీటీం ఇన్‌చార్జి, కరీంనగర్‌

ప్రేమ.. రెండక్షరాలు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్‌ ఫస్ట్‌ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తుండగా.. పలువురు లవ్‌ మ్యారేజ్‌ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.

ప్రేమించి,

పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్న జంటలు

ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న

కొన్ని గ్రామాలు

ముందు కెరియర్‌.. తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అంటున్న నేటి యువత

నేడు ప్రేమికుల దినోత్సవం

ఆకర్షణకు లోనుకావొద్దు

చాలామంది ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారు. ప్రేమ అంటే అనుభవం, ఆలోచన, నమ్మకం. దాని విలువ కొందరికే తెలుస్తుంది. యువత ఆకర్షణకు లోనుకావొద్దు. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి వద్దు. భవిష్యత్‌ ఏర్పరుచుకున్నాకే.. ప్రేమ, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలి.

– అశోక్‌కుమార్‌, లెక్చరర్‌

అర్థం చేసుకోవాలి

ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చి న పెళ్లి అయినా రెండు అంశాలు ము ఖ్యం. ఒకటి ఇద్దరి మధ్య ప్రేమ, రెండోది ఇద్దరి మధ్య అండర్‌ స్టాడింగ్‌. ఇవి లేకపోతే ఏ పెళ్లయినా ఎక్కువకాలం నిలవదు. పరస్పరం గౌరవించుకోవాలి. – స్నేహిత, విద్యార్థిని

ఇది విడాకుల ట్రెండ్‌

ప్రస్తుత సమాజంలో విడాకుల ట్రెండ్‌ నడుస్తోంది. ఎందుకంటే ఒకరిపై ఒకరికి నమ్మకం లేక విడిపోతున్నారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇద్దరూ నమ్మకంతో కలిసి బతకాలి. అలాంటి పార్ట్‌నర్‌ను అందరూ ఎంచుకోవాలి. – ఐశ్వర్య, విద్యార్థిని

బతకడానికి డబ్బు కావాలి

కెరీర్‌, పేరెంట్స్‌కు ఫస్ట్‌ ప్రయారిటీ ఇవ్వాలి. జీవిత భాగస్వామి ఎంపికలో అన్నీ ఆలోచించాలి. ప్రేమను గుడ్డిగా నమ్మకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఇద్దరూ కలిసి బతకాలి అంటే ప్రేమతోపాటు డబ్బు కూడా చాలా అవసరం. – సౌమ్య విద్యార్థిని

పెళ్లి తర్వాత ప్రేమే బెటర్‌

నా దృష్టిలో పెళ్లి తర్వాతి ప్రేమే స్వచ్ఛమైనది. మనపెద్దలు వెనుకాముందు ఆలోచించి పెళ్లి చేస్తారు. వారి అనుభవంతో కూడిన నిర్ణయాలు భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా చేస్తాయి. సమస్యలు వస్తే వారే పరిష్కరిస్తారు. – రమ్య, విద్యార్థిని

సాక్షి: బర్డ్‌ఫ్లూ కట్టడికి తీసుకున్న చర్యలేమిటి?

డీవీహెచ్‌వో : ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి జిల్లాకు కోళ్ల దిగుమతిని ఇప్పటికే కట్టడి చేశాం. సరిహద్దు ప్రాంతాల్లోనే నియంత్రించేలా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం.

సాక్షి: బర్డ్‌ఫ్లూను ఎలా నిర్ధారిస్తారు?

డీవీహెచ్‌వో : జిల్లాలోని కోళ్ల ఫారాలను తనిఖీ చే సేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చే శాం. ఆ బృందాలు పరీక్షలు నిర్వహించి సూచనలు ఇస్తాయి.

సాక్షి: పౌల్ట్రీ యజమానులకు ఏమైనా సూచనలు ఇస్తున్నారా?

డీవీహెచ్‌వో : జిల్లాలో ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ కేసులేమీ నమోదు కాలేదు. అయినా పౌల్ట్రీ యజమానుల్లోని ఆందోళనలు తొలగించేందుకు అవగాహన కల్పిస్తున్నాం.

సాక్షి: చికెన్‌, కోడిగుడ్లు తినొచ్చా?లేదా?

డీవీహెచ్‌వో : నిర్భయంగా చికెన్‌, కోడిగుడ్లు తినొ చ్చు. సాధారణంగా బర్డ్‌ఫ్లూ 32 – 34 ఫారన్‌హీట్‌ టెంపరేచర్‌ ఉన్నపుడే వస్తుంది. కానీ మనం చికెన్‌, కోడిగుడ్లను తినేందుకు 70 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రతలు గల వేడిలో ఉడికిస్తాం. ఇంతటి వేడికి వ్యాధి కారక క్రిములు చనిపోతాయి.

సాక్షి: జిల్లాలో పశుగణన పూర్తయిందా?

డీవీహెచ్‌వో : జిల్లాలో ఇప్పటివరకు పశుగణన 62శాతం వరకు పూర్తయింది. డిజిటల్‌ పద్ధతిన చేపట్టిన పశుగణన దాదాపు అన్ని గ్రామాల్లో మొదలైంది. జిల్లాలోని 2,20,063 ఇళ్లకు 1,36,559 ఇళ్లలో పశుగణన నిర్వహించాం.

న్యూస్‌రీల్‌

ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ

పట్టభద్రుల్లో 12 మంది, ఉపాధ్యాయుల్లో ఒకరు విత్‌డ్రా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మెదక్‌, నిజామా బాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో 12 మంది గ్రాడ్యుయేట్‌ ఎ మ్మెల్సీ అభ్యర్థులు కాగా ఒకరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కావడం గమనార్హం. తాజా ఉపసహంరణలు పోగా.. గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికల పోటీలో 56 మంది అభ్యర్థులు మిగిలా రు. ఇక టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరు ఉపసంహరించుకోగా.. 15 మంది బరిలో నిలిచా రు. విత్‌డ్రా చేసుకున్న గ్రాడ్యుయేట్స్‌ అభ్యర్థు ల్లో.. గవ్వల లక్ష్మి, ఎడ్ల సాయి కృష్ణప్రియ, కా వూరి సత్యనారాయణగౌడ్‌, ఆలగొండ కృష్ణ హరి, నాలకంటి యాదగిరి, బడే నరసయ్య, లింగాల శ్రీనివాస్‌, రేకల సైదులు, మదనం గంగాధర్‌, లింగం కృష్ణ, సోమగాని నరేందర్‌, దార మనోహర్‌ ఉన్నారు. అదేవిధంగా టీచ ర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో గవ్వల శ్రీకాంత్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

నేటి నుంచి రైల్వేగేట్‌ మూసివేత

పెద్దపల్లిరూరల్‌: గౌరెడ్డిపేట – పెద్దపల్లి మధ్య ఉన్న(ఎల్‌సీ–40టీ) రైల్వేగేటు నేటినుంచి నాలుగు రోజుల పాటు మూసిఉంచనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపా రు. రైల్వేట్రాక్‌ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నా రు. శుక్రవారం నుంచి సోమవారం వరకు గే టు మూసివేయనున్నట్లు వివరించారు. ప్ర యాణికులు సహకరించాలని వారు కోరారు.

సాక్షి: జిల్లావ్యాప్తంగా క్కల దాడులు మితిమీరాయి. వాటిని ఎలా నియంత్రిస్తారు?

డీవీహెచ్‌వో : మనుషులు, జంతువులపై కుక్కలు దాడులు చేస్తున్న మాట వాస్తవమే. అయితే, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వాటి సంతానోత్పత్తిని నియంత్రించేందుకు రామగుండంలో యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) సెంటర్‌ ఏర్పాటు చేసి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. సుల్తానాబాద్‌లోనూ ఏర్పాటు చేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
వేధింపులకు గురిచేస్తే చర్యలు1
1/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

వేధింపులకు గురిచేస్తే చర్యలు2
2/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

వేధింపులకు గురిచేస్తే చర్యలు3
3/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

వేధింపులకు గురిచేస్తే చర్యలు4
4/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

వేధింపులకు గురిచేస్తే చర్యలు5
5/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

వేధింపులకు గురిచేస్తే చర్యలు6
6/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

వేధింపులకు గురిచేస్తే చర్యలు7
7/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

వేధింపులకు గురిచేస్తే చర్యలు8
8/8

వేధింపులకు గురిచేస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement