ఇష్టపడ్డాం.. కష్టపడ్డాం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి శ్రీనివాస్, స్రవంతి దంపతులు వీరు. జమ్మికుంటలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో 2008లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత స్నేహితుల సహకారంతో 2012లో ప్రేమపెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. అయినా ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం కారు నడుపుకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. స్రవంతి గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. ‘మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రస్తుతం మా పాపతో ప్రయాణం గర్వంగా కొనసాగుతోంది’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment