బీసీల సంక్షేమానికే రిజర్వేషన్లు
గోదావరిఖని: బీసీల సంక్షేమం కోసమే రాష్ట్రప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు నిర్ణయించిందని రామగుండం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నా రు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను హీనంగా చూసిన చరిత్ర బీఆ ర్‌ఎస్, బీజేపీకి ఉందని విమర్శించారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగానే కుల గణనను చేప ట్టామని, సర్వేలో మిగిలిన వారి వివరాలను చే పడతామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఇసుక, బూడిద, మట్టిని ఉచితంగా అందించా లని నిర్ణయించామని తెలిపారు. మాజీ మే యర్ బంగి అనిల్‌కుమార్, నాయకులు మ హంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, తిప్పార పు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, బాలరాజ్, బొమ్మక రాజేశ్, బదావత్ శంకర్‌నాయక్, మారెల్లి రాజిరెడ్డి, గట్ల రమేశ్, ధర్మపురి, సదానందం, కొలిపాక సుజాత, దాసరి ఉమ, గుండేటి రాజేశ్, నాచగోని దశరథంగౌడ్ పాల్గొన్నారు.
‘కాంగ్రెస్‌కు ఓటమి భయం’
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభు త్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి విమర్శించారు. జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి గురువారం మండల కేంద్రానికి వచ్చిన ఆయనను బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్, మాజీ వైస్ ఎంపీ పీ చకినెపల్లి శంకరాచారి సన్మానించారు. అనంతరం సంజీవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బీసీల్లో ముస్లింలను కలిపి చూపించిన ప్రభుత్వం.. క్రిస్టియన్‌ల జనాభాను వెల్లడించలేకపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యను గెలిపించాలని కోరారు. నాయకులు ఈర్ల శంకర్, చల్లా చంద్రమౌళి, ఓర్పుల శీను, గరిడె కిషన్, దాసరి కృష్ణ, రాజేందర్ పాల్గొన్నారు.
కుష్ఠుపై అవగాహన అవసరం
ముత్తారం(మంథని): కుష్ఠు నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రస న్న కుమారి సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆ స్పత్రిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యాధ్రిస్తులు సకాలంలో, సరైన వైద్యం తీసుకుంటే వ్యాధిని నిర్మూలించే అవకాశం ఉందని తెలిపారు. లెప్ర సీ ప్రోగామ్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి, వైద్యులు శ్రీరాములు, కిరణ్‌కుమార్, అమరేందర్‌రావు, డీపీవోఎంలు సువార్త, రమేశ్ పాల్గొన్నారు.
రుణ వాయిదాలు చెల్లించాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ, వాయిదాలు సకాలంలో, సక్రమంగా చెల్లించా లని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియా జ్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్చి 31వ తేదీలోగా రుణ వాయిదా బకాయిలు చెల్లించేలా రిసోర్స్ పర్సన్లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.
గోదావరి నదిలో వ్యర్థాలు
రామగుండం: గోదావరిఖని నగరంలోని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో గోదావరి న ది కలుషితమవుతోంది. నీళ్లపై నురగ తేలుతోంది. పిచ్చిమొక్కలు, పూజాసామగ్రి, దహన సంస్కారాలకు వినియోగించే వ్యవర్థాలు, దేవతామూర్తుల చిత్రపటాలు గోదావరిలోనే వదిలే స్తున్నారు. పండుగలు, సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే ముందు భక్తులు గోదావరి స్నా నాలు ఆచరించడం ఆనవాయితీ. అయితే, నది లో కలుషితనీరు ఉండడంతో గత్యంతరం లేక అందులోనే స్నానాలు ఆచరిస్తున్నారు.
బీసీల సంక్షేమానికే రిజర్వేషన్లు
బీసీల సంక్షేమానికే రిజర్వేషన్లు
బీసీల సంక్షేమానికే రిజర్వేషన్లు
Comments
Please login to add a commentAdd a comment