పెద్దలను ఒప్పించి..
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనికి చెందిన గొడిశల శారద– నరేశ్ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. శారదను ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో నరేశ్ ప్రేమించాడు. తొలత వీరిప్రేమను ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. వారి కుటుంబాలను ఈ ప్రేమికులు ఒప్పించి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నరేశ్ ఎంబీఏ చదవగా, శారద డిగ్రీ పూర్తి చేసింది. వీరి ప్రేమకు గుర్తుగా మొదటిసారి కూతురు అక్షితరాయ్ జన్మించగా, ఆ తర్వాత కుమారుడు అమోగ్, కూతురు ఆరూహ్య అనే ఇద్దరు కవలలు పుట్టారు. నరేశ్ విద్యార్థి ఉద్యమాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. 2016లో సింగరేణిలో ఉద్యోగం పొందిన నరేశ్, ప్రస్తుతం జీడీకే 11వ ఇంక్లయిన్ గనిలో పని చేస్తూనే, ఏఐటీయూసీ యూనియన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment