ప్రజల హక్కుల కోసం పోరాటం
సాక్షి, పెద్దపల్లి: ప్రజల హక్కుల సాధన, ప్రజా స మస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతర పో రాటాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ దర్శి సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం జి ల్లాకేంద్రంలోని సీపీఐ జిల్లాస్థాయి సమావేశం కార్యదర్శి తాండ్రా సదానందం అధ్యక్షతన జరిగింది. ఆ యన మాట్లాడుతూ, కుల గణనలో పాల్గొనని వారి కి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించడం న్యాయబద్ధమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అ భ్యర్థుల విజయానికి కృషిచేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులకు సూచించారు. పొత్తుపై త్వరలోనే తమ విధివిధానాలను ప్రకటిస్తామని అన్నారు. సీపీఐ రా ష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. నాయకులు గోసిక మోహన్, గౌ తమ్ గోవర్ధన్, కడారి సునీల్, కనకరాజ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment