కోరుట్ల: కోరుట్ల ఆర్టీసి బస్టాండ్‌లో గురువారం వెలిచాల రుచిత బ్యాగులోని పర్సును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాదితురాలి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రుచిత మూడు రోజుల క్రితం కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామామైన తన తల్లి గారింటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ వెళ్లేందుకు కోరుట్ల బస్లాండ్లో దిగింది. మళ్లీ వెరే బస్సు ఎక్కి తన బ్యాగును చూడగా బ్యాగులో ఉన్న పర్సు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఉండటంతో తన బ్యాగులో ఉన్న పర్సును ఎవరో దొంగిలించారని, అందులో నాలుగు తులాల బంగారం, రూ.700 ఉన్నట్లు తెలిపింది. బస్టాండ్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను సీఐ సురేశ్‌బాబు, ఎస్సై శ్రీకాంత్‌లు పరిశీలించగా ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
● నాలుగు తులాల బంగారం, నగదు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment