‘చనిపోతా’నంటూనే..
కాలువలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన పొన్నం కనకమ్మ(78) గురువారం ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సదన్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కొంతకాలం క్రితం మతిస్థిమితం కోల్పోయిన కనకయ్య.. తాను చనిపోతా అంటూ గ్రామస్తులకు చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కాలువ వెంట తిరుగుతూ అందులో దూకింది. అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు, అదే గ్రామానికి చెందిన కొండ తిరుపతిగౌడ్ ఆమెను కాపాడి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే వృద్ధురాలు చనిపోయింది. మృతురాలి కుమారుడు పొన్నం మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలి భర్త కొమురయ్య గతంలోనే చనిపోయాడు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం రాజమ్మ(75) వృద్ధాప్యం బాధ భరించలేక పురుగులమందు తాగి ఆత్మహ్యత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందుతాగింది. ఆ తర్వాత కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.
పశువుల పాక దగ్ధం
● పాడి గేదె సజీవ దహనం
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఓ పశువుల పాక దగ్ధం కావడంతో పాటు, అందులో ఉన్న పాడి గేదె సజీవ దహనమైంది. వివరాలిలా ఉన్నాయి. జాబితాపూర్‌లోని అదె మోహన్‌కుచెందిన పశువుల పాకలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి అందులోని పశువులను వదిలిపెట్టగా ఒక పాడిగేడె సజీవ దహనమైంది. పక్కనే ఉన్న రాజిరెడ్డి, మత్తయ్య, రాజేందర్‌లకు చెందిన సుమారు రూ.లక్ష విలువైన పశుగ్రాసం కూడా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంట లు ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు.
అడవికి నిప్పు
వీర్నపల్లి: కంచర్ల అల్మాస్‌పూర్ గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పటించారు. స్థానికులు గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అల్మాస్‌పూర్ సెక్షన్ ఆఫీ సర్ పద్మలత, ఎఫ్‌బీవో సతీశ్‌తో కలిసి మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా కంచర్ల గ్రామస్తులు మాట్లాడుతూ.. వారం క్రితం గ్రామంలోని కోతులను గ్రామస్తులంతా అడవిలోకి కోతులను తరిమా రు. ఇప్పుడు అడవికి నిప్పంటుకోవడంతో మళ్లీ కోతులు గ్రామంలోకి వచ్చి హంగామా చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అడవికి నిప్పుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
‘చనిపోతా’నంటూనే..
Comments
Please login to add a commentAdd a comment