ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్‌లో ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించి, మాట్లాడారు. బీసీ కులాల అభివృద్ధి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ఇప్పటివరకు కులగణన సర్వేలో పాల్గొనని వారు ఈ నెల 16 నుంచి 28 వరకు చేపట్టే సర్వేలో పాల్గొనాలని సూచించారు.
పంటలను కాపాడుతాం
ఎగువ మానేరుకు మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని వదిలి, ఆయకట్టు పంటలను కాపాడుతామని ప్రభుత్వ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. నాగంపేటలో రూ.8 కోట్లతో పంపుసెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కాల్వల్లో మట్టి తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ సాబేర బేగం, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment