కరీంనగర్‌క్రైం: వ్యవసాయ భూమి హద్దుల విషయ ంలో చెలరేగిన వివాదంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన తండ్రి,కొడుకులు బోనగిరి ఓదేలు(60), బోనగిరి జంపయ్య(32)కు జీవితఖైదుతో పా టు రూ.2,500 చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకా రం.. శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన రాచమల్ల రామలింగు, రాచమల్ల సంపత్ తండ్రీకొడుకులు. ఈరికి గ్రామశివారులో ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. వీరి భూ మి పక్కనే శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన బోనగిరి జంపయ్య, ఓదేలు వ్యవసాయ భూమి ఉంది. వీరి ఇరువురి మధ్య హద్దుల విషయ ంలో గొడవలు జరుగుతున్నాయి. 2020 డిసెంబర్ 10న ఉదయం 11గంటల ప్రాంతంలో రాచమల్ల సంపత్(40) తన వ్యవసాయ భూమి వద్ద ఒంటరి గా ఉండగా జంపయ్య, ఓదేలు గొడ్డలి, రాడ్డు, కర్రలతో దాడి చేయగా.. సంపత్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదుతో శంకరపట్నం పోలీసులు జంపయ్య, ఓదేలుపై కే సు నమోదు చేశారు. అప్పటి సీఐ ఈ.కిరణ్ దర్యా ప్తు చేశారు. ఈ కేసులో సాక్ష్యులను అడిషనల్ పబ్లి క్ ప్రాసిక్యూటర్ జూలూరు శ్రీరాములు విచారించా రు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి ప్రతిమ నేరస్తులకు జీవితఖైదు, జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment