
చావు శరణ‍్యమై..
ప్రభుత్వం సాయం చేయాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన రైతు కోమటి నాగరాజు (49) అప్పుల బాధ తాళలేక 2024 నవంబర్ 30న తనపొలం వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం భార్య లక్ష్మి తన కొడుకు రంజిత్‌తో కలిసి తనకున్న నాలుగెకరాలతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేస్తున్నారు. ముగ్గురు కూతుళ్లలో పెద్దమ్మాయి వివాహమైంది. రెండో కూతురు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగిని. చిన్న కూతురు కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తమకు రైతు రుణమాఫీ కాలేదని లక్ష్మి తెలిపింది. తన భర్త పేరిట రైతుబీమా వచ్చినట్లు పేర్కొంది. బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, ప్రభుత్వం సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది.

చావు శరణ‍్యమై..
Comments
Please login to add a commentAdd a comment