
ఆలయం నిర్మిస్తాం
ధర్మారం(ధర్మపురి): సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బంజేరుపల్లి తండా–బీ గ్రామంలో ఆదివారం సేవాలా ల్ మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. విప్ హాజరై తొలుత పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గిరిజనుల కోసమే సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. బంజేరుపల్లి తండా–బీలో చేపట్టిన సేవాలాల్ ఆలయ నిర్మాణం పూర్తిచేయిస్తామని విప్ హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, మాజీ సర్పంచ్ భూక్య చంద్రానాయక్, మాజీ ఎంపీటీసీ భూక్య రాజునాయక్, మాజీ ఉపసర్పంచ్ రమేశ్‌నాయక్, నాయకులు చంద్రానాయక్, జితేందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కోటీశ్వరులతో బీసీ బిడ్డ పోటీ
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ కోటీశ్వరులతో పోటీ పడుతున్నారని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు నార్ల గోపాల్‌యాదవ్, కార్యదర్శి కాంపల్లి బాపు అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతి థి గృహంలో ఆదివారం వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ బలపర్చిన ప్రసన్న హరికృష్ణను మెదక్, ఆదిలాబాద్, నిజామబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. నాయకులు గోట్టె రాజు, బోంకురి దుర్గయ్య, సాతురి అనిల్, బోయిని రంజిత్, రామీళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు
ఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): జూలపల్లి మా జీ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, రాంగోపాల్‌రెడ్డి దంపతులు, రామకృష్ణారెడ్డి, గాండ్ల చంద్రయ్య, ముప్పిడి శ్రీనివాస్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరా రు. ఎలిగేడు మండలం శివపల్లిలోని ఎమ్మెల్యే విజయరమణారావు నివాసంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈనెల 27న నిర్వహించే పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. ఈనెల 17న పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్‌లో నిర్వహించే సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఆయన కోరారు. ధూళికట్ట సింగిల్‌విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్‌రావు, నాయకులు రాజారాంరెడ్డి, గంగిపల్లి చొక్కయ్య, అలకొండ అనంతరెడ్డి, దాడికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల గొంతు వినిపించే అవకాశం వచ్చింది..
సుల్తానాబాద్(పెద్దపల్లి): శాసన మండలిలో బీసీల గొంతు వినిపించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల రవీందర్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు వేదిక కావొద్దని, ప్రజాపోరాటాలతోనే పాలకుల మైండ్ సెట్ మార్చుతావనాయన అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీలుగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీ చేయించడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున గళం వినిపించగలిగే సత్తా కలిగిన నేతలే మండలిలో అడుగు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకుల పాల్గొన్నారు.

ఆలయం నిర్మిస్తాం

ఆలయం నిర్మిస్తాం
Comments
Please login to add a commentAdd a comment