
హద్దులు లేక అన్యాక్రాంతం
రామగుండం: పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈక్రమంలోనే దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే లెదర్ పార్క్/ఇండస్ట్రీ (లిడ్‌క్యాప్/తోలు పరిశ్రమ) స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో పాదరక్షలు తయారు చేస్తూ దళిత యువతకు ఉపాధి కల్పించాలని సంకల్పించింది. ఈక్రమంలోనే 2003 నవంబర్ 27న అప్పటి ఉమ్మడి రామగుండం మండలంలోని లింగాపూర్ గ్రామ శివారు సర్వే నంబరు 132లో సుమారు 25 ఎకరాలను లెదర్ పార్క్ కోసం ప్రభుత్వం కేటాయించింది.
22 ఏళ్లు గడిచినా..
తోలు పరిశ్రమ ఏర్పాటుకు తొలుత ప్రభుత్వం అవసరమైన చర్యలు ప్రారంభించినా.. ఆ తర్వాత పాలకులు దీనిపై తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో సుమారు 22 ఏళ్లుగా లెదర్ పరిశ్రమ ఏర్పాటుకు అడుగు ముందుకు పడడంలేదు. పరిశ్రమ ఏర్పాటులో ఆనాడు ప్రాతినిధ్యం వహించిన దళిత సంఘాల ప్రతినిధులు.. లిడ్ క్యాప్ పరిశ్రమ స్థాపనలో విశేషంగా కృషి చేసినా చివరకు ఏమీ సాధించలేక విఫలమయ్యారు.
భూములు కబ్జా పాలు..
లెదర్ పార్క్ కోసం కేటాయించిన స్థలంలో సగం ఇప్పటికే అన్యాక్రాంతమైంది. అందులోని సుమా రు ఐదెకరాల విస్తీర్ణంలో మోడల్(ఆదర్శ విద్యాలయం) స్కూల్ భవనం నిర్మించారు. మరో ఐదెకరాల విస్తీర్ణంలో గౌడకులస్తులు ఈతవనం పెంచుకునేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఇలా లెదర్ పార్క్ భూములను వివిధ సంఘాలు, ప్రభుత్వ అవసరాలకు కేటాయించడంతో దళిత సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. అంతేకాదు.. లెదర్ పార్క్ కోసం కేటాయించిన భూముల ను పరిరక్షించుకునేందుకు ఆలిండియా అంబేడ్క ర్ సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తొలిదశలో లెదర్ పార్క్ స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత లెదర్ పార్క్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని ప్రణాళిక రూపొందించారు.
దళితుల భూములపై అక్రమార్కుల కన్ను
రెండు దశాబ్దాలు గడిచినా దృష్టి సారించని అధికారులు
కబ్జాదారుల చేతుల్లోకి చేరుతున్న లెదర్ పార్క్ భూములు
ఉద్యమాలకు సిద్ధమవుతున్న దళిత సంఘాల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment