
పుస్తక పఠనం.. భవితకు నిర్దేశం
జ్యోతినగర్(రామగుండం): పుస్తక పఠనం భవిత్‌ను నిర్దేశిస్తుందని రామగుండం ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్)బిజయ్ కుమార్ సిగ్దర్ అన్నారు. అధికారిక భా షను ప్రోత్సహించడానికి పర్మినెంట్ టౌన్‌షిప్‌లో ఆదివారం మొబైల్ హిందీ పుస్తక గ్రంథాలయం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు విభిన్న సాహిత్య, విద్యావనరులను మొబైల్ గ్రంథాలయం అందుబాటులో ఉంచుతుందన్నారు. సామాజిక, విద్యాభివృద్ధికి ఎన్టీపీసీ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. హిందీ, తెలుగు, ఆంగ్ల భాషల్లో నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
రామగుండం: వేసవిలో ప్రజల దాహం తీర్చేందు కు ముఖ్య కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంఘాలు, సేవా సమితులు ముందుకు రావాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. ఆదివారం స్థానిక సంతలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడు అయోధ్యసింగ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవిలో చల్లని నీటిని ప్రజలకు అందించాలని సూచించారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
సండే మార్కెట్‌లో సమస్యలను పరిష్కరించాలని పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాలిపెల్లి తిరుపతి, ప్రతినిధులు ఈదునూరి హరిప్రసాద్, సింగం కిరణ్‌కుమార్‌గౌడ్, ఎండీ గౌస్‌బాబా, అప్పాసి శ్రీనివాస్, ఉరిమెట్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
‘సెక్యూరిటీ’ వాహనం ఏమైంది?
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు నివాసం ఉండే పర్మినెంట్ టౌన్‌షిప్ భ ద్రతా సిబ్బంది అధీనంలో ఉంటుంది. దీనికి ఉన్న రెండు మెయిన్ గేట్ల వద్ద వీరు విధులు నిర్వహిస్తారు. ముఖ్యమైన కేంద్రాల వద్ద కూడా రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ వాహనంలో గస్తీ తిరుగుతారు. అయితే, ఐదు నెలల క్రితం సెక్యూరిటీ వాహనం టెండర్ గడువు పూర్తికావడంతో అందుబాటులో లేకుండాపోయింది. కొత్త టెండర్ నిర్వహణలో జాప్యం కావడంతో వాహనం లేక సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

పుస్తక పఠనం.. భవితకు నిర్దేశం
Comments
Please login to add a commentAdd a comment