ఏఐ నిర్ధారిస్తోంది! | - | Sakshi
Sakshi News home page

ఏఐ నిర్ధారిస్తోంది!

Published Tue, Feb 18 2025 12:13 AM | Last Updated on Tue, Feb 18 2025 12:13 AM

ఏఐ నిర్ధారిస్తోంది!

ఏఐ నిర్ధారిస్తోంది!

● జిల్లాలో తొలిసారి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్స్‌రే సేవలు ● రెండు నెలల్లోనే 200 టీబీ కేసుల గుర్తింపు ● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న కుమారి వెల్లడి

కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలో క్షయ(టీబీ) చా పకింద నీరులా విస్తరిస్తోంది. భారత్‌ను క్షయ రహి త దేశంగా ప్రకటించడానికి 347 జిల్లాల్లో ‘ని–క్షయ్‌ శివర్‌’ పేరిట గతేడాది డిసెంబరు 7న వంద రోజు ల టీబీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలను ఎంపిక చేయగా, ఇందులో పెద్దపల్లి జిల్లాపై ‘రాష్ట్ర క్షయ విభాగం’ప్రత్యేక దృష్టి సారించింది. టీబీ కట్టడికి మొబైల్‌ వ్యాన్ల ద్వారా విస్తృతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన లోపమా, అలసత్వమా తెలియదు కా నీ.. వ్యాధి లక్షణాలు ఉన్నా కొందరు పట్టించుకోవడం లేదు. వ్యాధి ముదిరి.. ఒకరి నుంచి మరొకరి కి వ్యాపిస్తోంది. వ్యాధిని త్వరగా గుర్తిస్తే వ్యాప్తిని నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.

డీఎంహెచ్‌వో పరిశీలన..

రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో టీబీ నిర్ధారణ పరీక్షలను అత్యాధినిక ఏఐ(ఆర్టిఫిషియల్‌) ఎక్స్‌రే ద్వారా నిర్వహిస్తున్న తీరును డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి సోమవారం పరిశీలించారు. అనుమానితులకు వ్యాధి నిర్మూలనపై ఇదే సమయంలో అవగాహన కల్పించారు.

తొలిసారి ఏఐ ఎక్స్‌రే..

జిల్లాలో తొలిసారి టీబీ నిర్ధారణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌ వినియోగిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఏఐ పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌ వ్యాధి ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఏడు నిమిషాల్లోనే పరీక్ష పూర్తిచేస్తున్నారు. రోజూ 350 – 400 మందికి ఏఐ పోర్టబుల్‌ ఎక్స్‌రే తీస్తున్నారు. అలాగే జీజీహెచ్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ ఆస్పత్రుల్లో పాత పద్ధతిలోనే ఎక్స్‌రేలతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

రిస్క్‌లో 93,300 మంది..

జిల్లాలో సుమారు 93,300 మందికి టీబీ సోకే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేశారు. గత డిసెంబర్‌ నుంచి శనివారం వరకు సుమారు 200 మందికిపైగా వ్యాధి నిర్ధారణ జరిగింది. అంతకు ముందు గుర్తించిన వారితో కలిపితే ప్రస్తుతం 700 మంది వ్యాధిగ్రస్తులు వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు.

లక్షణాలు ఇవే..

నిరంతరం దగ్గు, సాయత్రం జ్వరం రావడం, ఆకలి మందగించడం, వికారంగా ఉండడం, ఛాతిలో నొప్పిరావడం, బరువు తగ్గడం క్షయ లక్షణాలని డాక్టర్లు చెబుతున్నారు. మైక్రోబ్యాక్టీరియా క్యుబర్‌ క్యూలోసిస్‌ అనే బాక్టీరియాతో క్షయ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. గాలిద్వారా ఇతరులకూ వ్యాపిస్తుంది. పేషెంట్‌ దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపిస్తుంది.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి..

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ ఆస్పత్రుల్లో కఫం పరీక్ష చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈ పరీక్ష కేంద్రాలు నాలుగు ఉన్నాయి. పీహెచ్‌సీల్లోనూ 18 టీబీ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏ కేంద్రానికి వెళ్లినా ఉచితంగా టీబీ నిర్ధారణ పరీక్ష చేసి ఉచితంగా మందులు అందజేస్తారు.

నిపుణుల సూచనలు ఇవీ..

క్షయ బారినపడకుండా వ్యవసనాలకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం, సురిక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. టీబీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే పూర్తికాలం పాటు మందులు వాడాలి. సాధారణ క్షయకు ఆర్నెల్లు, మధ్యలో మానివేసిన వారు 8 నెలలు, మొండిక్షయ బాధితులు రెండేళ్లపాటు మందులు వాడాలి. మధ్యలో మందులు మానేస్తే వ్యాధి నిరోధక శక్తి క్షీణించి మృత్యవాతపడే ప్రమాదం కూడా ఉంది.

రిస్క్‌ ఉంటే వ్యాప్తి అధికం

క్షయ వెంట్రుకలు, గోళ్లకు తప్ప శరీరంలోని ఏ అవయవాన్ని అయినా ఆశిస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించి పల్మనరీ టీబీ ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. గర్భాశయం, చర్మం, ఎముకలు, కళ్లకు వచ్చే క్షయను ఎక్సట్రా పల్మనరీ టీబీ అంటారు. ఇది ఎక్కువగా హెచ్‌ఐవీ, మధుమేహం, రక్తహీనత, అవయవాల మార్పిడి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement