పదెకరాల్లో ఐటీ పార్క్‌ | - | Sakshi
Sakshi News home page

పదెకరాల్లో ఐటీ పార్క్‌

Published Tue, Feb 18 2025 12:13 AM | Last Updated on Tue, Feb 18 2025 12:13 AM

పదెకర

పదెకరాల్లో ఐటీ పార్క్‌

సాక్షి, పెద్దపల్లి: రూరల్‌ టెక్నాలజీలో భాగంగా పె ద్దపల్లిలో ఐటీ పార్క్‌ నిర్మిస్తామని ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించా రు. ఇందుకోసం పట్టణంలో పదెకరాలు కేటాయించామని, త్వరలో భవన నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. పట్టణ శివారలోని స్వరూప గార్డెన్స్‌ లో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీ య సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ఇంజినీరింగ్‌, ఐటీ విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు టాస్క్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి 250మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదీలీలు, పదోన్నతులను తమ ఏడాది పాలనలోనే నిజాయతీగా, పారదర్శకంగా చేపట్టామని మంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు నరేందర్‌రెడ్డికే ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. జీవో నంబర్‌ 317తో ఇబ్బంది పడేవారికి న్యాయం చేస్తున్నామని, ఇందుకోసం మంత్రి రాజనరసింహ ఆధ్వర్యంలో సబ్‌కమిటీ ఏర్పాటు చేసి స్పౌజ్‌, మ్యూచువల్‌, మెడికల్‌ ఆధారంగా బదిలీలు చేశామన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా 1931 తర్వాత దేశంలోనే తొలిసారి మనరాష్ట్రంలో బీసీ గణన చేపట్టామని అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు న్యాయం చేయాలన్నారు. రాహుల్‌ గాంధీ గురించి బండి సంజయ్‌ తెలిసోతెలియకో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చివరి ఆ యకట్టుకు సాగునీరు అందించేందుకు పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ విప్‌, ఎ మ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, డీసీసీ అధ్యక్షు డు, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, విజయరమణారావు మాట్లాడారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి బండారి శ్రీకాంత్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): యువతకు ఉద్యోగాల కల్పనకు త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక మాతంగికాలనీలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వుట్కూరి నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఐఎన్టీయూసీ నాయకులు జనక్‌ ప్రసాద్‌, ఆరెపల్లి మోహన్‌, బొంతల రాజేశ్‌, మహంకాళి స్వామి, మాజీ మేయర్‌ బింగి అనిల్‌ కుమార్‌, రాజమణి, గౌస్‌, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాటపై నిలబడేది కాంగ్రెస్సే

మంథని: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తుందని, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పాలించే ఏకై క పార్టీ కాంగ్రెస్‌ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. స్థానిక ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డితో కలిసి మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో న రేందర్‌రెడ్డి మద్దతుగా నిలబడాలని కోరారు. త న వస్తున్న ఆరోపణలు అవాస్తమవి, పేదవి ద్యా ర్థులకు ఫీజులో ఐదు శాతం రాయితీ కల్పిస్తామ ని నరేందర్‌రెడ్డి తెలిపారు. నాయకులు ఐత ప్రకా శ్‌రెడ్డి, ఐలి ప్రసాద్‌, పెండ్రు రమ, కొత్త శ్రీనివా స్‌, కొండ శంకర్‌, ఆకుల కిరణ్‌ పాల్గొన్నారు.

పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తాం

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
పదెకరాల్లో ఐటీ పార్క్‌ 1
1/1

పదెకరాల్లో ఐటీ పార్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement