శిథిలమైన నాలాల పునర్నిర్మాణానికి చర్యలు
కోల్‌సిటీ(రామగుండం): మురుగు నీరు నిలిచి పోకుండా శిథిలమైన నాలాలను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) జె.అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 10, 38, 39వ డివిజన్లలో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి ఉపరితల కాలువలను పరి శీలించారు. 2ఏ ఇంక్లయిన్ మోరీ వద్ద శిథిలమైన నాలా కారణంగా మురుగునీరు నిలిచిపోయిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షా కాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా వరద నీటి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 39వ డివిజన్‌లోని డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి చెత్త పేరుకుపోకుండా కుప్పలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ శివానంద్, డీఈఈ జమీల్ తదితరులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ జింక్ సభ్యులకు సింగరేణి రెస్క్యూ శిక్షణ
గోదావరిఖని: రాజస్తాన్‌లోని హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) సంస్థ సభ్యుల కు సింగరేణి రెస్క్యూ సభ్యులు మంగళవారం నుంచి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో పాల్గొంటున్న 14 మంది సభ్యుల బృందంలో ఏడుగురు మహిళలున్నారు. రామగుండం మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో 15రోజుల పాటు రెస్క్యూపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు. సింగరేణి రెస్క్యూ చరిత్రలో ఇతర సంస్థలకు చెందిన మహిళా రెస్క్యూ సభ్యులకు శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, రెస్క్యూ సూపరింటెండెంట్ బి.మాధవరావు, ఇన్‌స్ట్రక్టర్ భాస్కర్‌రెడ్డి, ఏఎన్ మూర్తి బ్రిగేడ్ సభ్యులు పాల్గొన్నారు.
మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి
మంథని: కలెక్టర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో ఆస్పత్రిలో చేపట్టిన వార్డుల మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. మంగళవారం మంథనిలోని సామాజిక వైద్యశాలను సందర్శించి ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాలు, స్టాక్‌ను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మంథని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్‌తో పాటు తదితరులు ఉన్నారు.
పన్ను వసూళ్లలో లక్ష్యం సాధించాలి
జూలపల్లి: గ్రామపంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేసి నిర్దేశించిన లక్ష్యం సాధించాలని పెద్దపల్లి డీఎల్‌పీవో వేణుగోపాల్ అన్నారు. మంగళవారం జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామపంచాయతీలో రికార్డులు పరిశీలించి ఇంటి పన్ను వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీవో అనిల్‌రెడ్డితో కలిసి పారిశుధ్య పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. డీఎల్‌పీవో వెంట కార్యదర్శులు ఖాజాముజీబుద్దీన్ మహ్మద్, తీగెల సతీశ్, కారోబార్ పురుషోత్తం, చంద్రమౌళి, సిబ్బంది ఉన్నారు.
శిథిలమైన నాలాల పునర్నిర్మాణానికి చర్యలు
శిథిలమైన నాలాల పునర్నిర్మాణానికి చర్యలు
శిథిలమైన నాలాల పునర్నిర్మాణానికి చర్యలు
Comments
Please login to add a commentAdd a comment