‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
రామగిరి: మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితా లు సాధించేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో విసృత్తంగా పర్యటించారు. పన్నూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాల, నాగెపల్లి ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లలకు పాఠాలు బోధించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పన్నూర్ గ్రామంలోని కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులకు అవసరమైన మేరకు వాటర్ హీటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. మూడు వైపుల ప్రహరి ఏర్పాటు, డ్యూయల్ డెస్క్‌లకు ప్రతిపాదనలు పంపిచాలని సూచించారు. పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రత్యేకాధికారి మంజుల కోరగా కలెక్టర్ సానుకులంగా స్పందించారు. బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యులు సమయపాలన పాటించాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో సింగరేణి, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. మేడిపల్లి గ్రామంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు జారీ చేసిన ప్రాథమిక భూ సేకరణ నోటిఫికేషన్‌కు సంబంధించి ఎంజాయిమెంట్ సర్వేచేసి రికార్డు నమోదు చేయాలన్నారు. జాతీయ రహదారి పెండింగ్ ట్రంచ్ కటింగ్ పూర్తి చేయాలని, ఎవరికై నా పరిహారం పెండింగ్‌లో ఉంటే తక్షణమే పూర్తి చేయలన్నారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ సుమన్, ఆర్జీ–3 జీఎం నరేంద్ర సుధాకర్‌రావు, ఎస్టేట్ అధికారులు ఐలయ్య, శ్యామల, ఎంపీడీవో శైలజారాణి, ఎంఈవో కొమురయ్య, ఎంపీవో ఉమేశ్, మండల వైద్యాధికారి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment