ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
● జిల్లా విద్యాధికారి మాధవి
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో ‘కలాం స్ఫూర్తి యాత్ర’ ద్వారా విద్యార్థులు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని డీఈవో డి.మాధవి సూచించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హ్యాండ్స్–ఆన్‌లెర్నింగ్ అనుభవాన్ని అందించారు. విద్యార్థులు వినూత్న ఆవిష్కరణల లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులకు ఎల్‌ఓటీ, ఏఐ, 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఏఆర్/వీఆర్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు కె.రామచంద్రం, జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్‌రావు, కరుణశ్రీ, కృష్ణాకర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంఈవోలు, క్లస్టర్ ఇన్‌చార్జిలకు వర్క్‌షాప్ నిర్వహించారు. పాఠశాల ప్రొఫైల్, వసతుల నవీకరణ, ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాల నమోదు, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడం తదితర అంశాలపై సమీక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
జ్యోతినగర్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ను అందిస్తున్నామని డీఈవో డి.మాధవి అన్నారు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సపోర్టివ్ టీం బృందం సభ్యులు సందర్శించారు. తరగతివారీగా విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించారు. 1, 2వ తరగతి విద్యార్థులు కనబరిచిన ప్రతిభను ప్రశంసించారు. హెడ్మాస్టర్ జయరాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment