
తూకం.. మోసం
ఇది రామగుండంలోని ప్రధాన కూరగాయల మార్కెట్. పాతరకపు త్రాసు, బాట్లతో కూరగాయలు తూకం వేస్తోంది ఈ మహిళా వ్యాపారి. తూకంలో మోసం జరగకుండా ఎలక్ట్రానిక్ యంత్రంపైనే తూకం వేయాలి. కానీ, ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఫలితంగా ఒక్కో కిలోపై కస్టమర్ కనీసం 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు నష్టపోతున్నాడు.
సాక్షి, పెద్దపల్లి: కిరాణం, సూపర్ మార్కెట్‌కు వెళ్లి కిలో చక్కెర, అర్ధకిలో కందిప్పు కావాలంటే ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి ఇస్తున్నారు. కానీ, కిలో బదులు 950 గ్రాములు, 500గ్రామలకు బదులు 450గ్రాములే తూకం ఉంటోంది. కేజీలో 150 గ్రాములు, అర్ధకిలోకు కనీసం 50 గ్రాములు కస్టమర్లు నష్టపోవాల్సి వస్తోంది. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు తూకంలో మోసాలు చేస్తూనే ఉన్నారు. సాధారణ త్రాసుతోపాటు ఎలక్ట్రానిక్ యంత్రాల నూ ట్యాంపర్ చేసి నిలువునా దోచుకుంటున్నారు. తూకం, కొలతల్లో వ్యత్యాసంతోపాటు చిరునామా లేని చిరుతుండి, ఆహార పదార్థాల పొట్లాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అయినా, పట్టించుకునే వారే కరువయ్యారు. తూకంంలో మోసంతో పాటు ఎమ్మార్పీలోనూ దగా చేస్తున్నారు.
తనిఖీలు లేకనే..
జిల్లాలోని కిరాణాలు, సూపర్ మార్కెట్లు, కూరగాయల దుకాణాలు, పంట కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, ఎలక్ట్రానిక్ యంత్రాలను వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు వినియోగించే బాట్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను లీగల్ మెట్రా లజీ అధికారులు తనిఖీ చేశారు. అన్నీ సక్రమంగా ఉంటే రెండేళ్ల కాలపరిమితో లైసెన్స్ జారీచేయాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలి. అయితే, జిల్లాలో ఎక్కడా ఈ పద్ధతి అమలు కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిరాణాలు, బహిరంగ ప్రదేశాల్లో వ్యాపారం చేసేవా రు ఒక్కోకిలోకు 50 గ్రామలు నుంచి 100గ్రామలు వరకు తూకంలో మోసం చేస్తున్నారు. ముద్ర లేనిబాట్లు, తూకం మిషన్లను వినియోగిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ కాంటాలతోనూ కుచ్చుటోపి
ఎలక్ట్రానిక్ కాంటా ఖాళీగా ఉంటే డిస్‌ప్లే సున్నా బ రువు చూపిస్తుంది. తర్వాత సరుకులు పెట్టి బరువు లు లెక్కిస్తారు. కానీ, దానిలోని ఆప్షన్లను మార్చడం ద్వారా సరుకులు పెట్టినా ఎక్కువ బరువు డిస్‌ప్లే అ య్యేలా చేస్తున్నారు. ఉదాహరణకు కాంటాపై 950 గ్రామలు సరుకు పెడితే 1,000గ్రాముల బరువు చూపించేలా సెట్టింగ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ యంత్రాలకు తూనికలు, కొలతల శాఖ అధికారుల నుంచి లైసెన్స్ పొందాలి. సీల్ తొలగించరాదు. ఎలక్ట్రానిక్ కాంటాలు, బాట్లను అందుబాటులో ఉంచాలి. అనుమానం వస్తే వాటితో తూకం వేసి చూపించాలి. జిల్లాలో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు.
జాగ్రత్తగా పరిశీలించుకోవాలి
కొనుగోలు చేసే ప్రతీ వస్తువు తూకం సరిగా ఉన్నదీ లేనిదీ, ఎమ్మార్పీ, కొలతలు తదితర వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. తూకాల్లో తేడా ఉన్నట్లుగా భావిస్తే ఫిర్యాదు చేయాలి. వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేసి పరిహారం పొందే హక్కు ఉంది.
– విశ్వేశ్వరయ్య,
లీగల్ మెట్రాలజీ అధికారి
ఫోరాన్ని ఆశ్రయిస్తే పరిహారం
నిత్యావసరాల్లో కల్తీ, అడ్డగోలు ధరలు, ఆర్థిక మోసాలు.. ఇలా వినియోగదారులు నిత్యం ఏదోఒకరూపంలో దగా పడుతున్నారు. వస్తుసేవలకు దూరమవుతున్నారు. ఒకవైపు ఆధునికత అందుబాటులోకి వస్తున్నా.. మరోవైపు ఆన్‌లైన, ఆఫ్‌లైన్ మోసాలు, మల్టీలెవల్ మార్కెటింగ్ వంటివి అక్షరాస్యులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంకా బోగస్ ఫైనాన్స్ సంస్థలు, చిట్‌ఫండ్‌లతో అనేక విధాలుగా కస్టమర్లు నష్టపోతూనే ఉన్నారు. ఈ తరహా మోసాలను అరికట్టి, రక్షణగా నిలిచేందుకే వినియోగదారుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం 1962 మార్చి15న అమల్లోకి రాగా, మనదేశంలో 1986లో చట్టం రూపొందించారు. వస్తుసేవల్లో నష్టపోతే వినియోగదారుల ఫోరంలో ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 180042500 333కు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చు.
ఏది కొనుగోలు చేసినా నష్టమే
వినియోగదారుల జేబుకు చిల్లు
నేడు వినియోగదారుల దినోత్సవం
బియ్యం వ్యాపారులు, రైస్
మిల్లర్లు 25 కేజీల బస్తాపై బరువు 26 కేజీలు ఉన్నట్లు ముద్రిస్తున్నారు. అందులో 25 కేజీల కన్నా తక్కువగానే బియ్యం నింపుతున్నారు. కస్టమర్ల వద్ద 26 కేజీల ధర వసూలు చేస్తున్నారు. జీఎస్టీ తప్పించుని ప్రభుత్వ ఆదాయానికి ఇలా గండికొడుతున్నారు.
జిల్లాలోని ఓ మద్యం దుకాణం
పక్కన ఉన్న స్నాక్స్ షాప్‌లో
ఎమ్మార్పీ కన్నా రూ.5 అధికంగా వాటర్ బాటిల్ వ్రియిస్తున్నారని లీగల్ మెట్రాలజీ అధికారులకు ఇటీవల ఫిర్యాదు అందింది. దీంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు దుకాణంలో తనిఖీ చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో నిర్వాహకులపై అధికారులు కేసు నమోదు చేశారు.

తూకం.. మోసం

తూకం.. మోసం