
సౌతాంప్టన్: భారత క్రికెట్ పురుషుల, మహిళల జట్లు గురువారం ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాయి. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంనుంచి ప్రత్యేక వాహనాల్లో ఆటగాళ్లంతా సౌతాంప్టన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న కరోనా ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక అయిన రోజ్ బౌల్ మైదానం పరిధిలోనే ఉన్న ‘హిల్టన్’ హోటల్‌లోనే టీమిండియా సభ్యులకు వసతి ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు హోటల్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత సహచరుడు రిషభ్ పంత్‌తో కలిసి రోహిత్ శర్మ ‘వి ఆర్ ఇన్ సౌతాంప్టన్’ అని హోటల్ బాల్కనీలో ఉన్న ఫొటోతో ట్వీట్ చేశాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇదే మైదానంలో పురుషుల జట్టు ప్రాక్టీస్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment