Rose Bowl Stadium
-
‘రోజ్ బౌల్’ చెంత...
సౌతాంప్టన్: భారత క్రికెట్ పురుషుల, మహిళల జట్లు గురువారం ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాయి. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంనుంచి ప్రత్యేక వాహనాల్లో ఆటగాళ్లంతా సౌతాంప్టన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న కరోనా ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక అయిన రోజ్ బౌల్ మైదానం పరిధిలోనే ఉన్న ‘హిల్టన్’ హోటల్లోనే టీమిండియా సభ్యులకు వసతి ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు హోటల్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత సహచరుడు రిషభ్ పంత్‌తో కలిసి రోహిత్ శర్మ ‘వి ఆర్ ఇన్ సౌతాంప్టన్’ అని హోటల్ బాల్కనీలో ఉన్న ఫొటోతో ట్వీట్ చేశాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇదే మైదానంలో పురుషుల జట్టు ప్రాక్టీస్ చేస్తుంది. -
‘ఫైనల్’ వేదిక మారింది!
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదికను అనూహ్యంగా మార్చాల్సి వచ్చింది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కేంద్రమైన లార్డ్స్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అయితే ఇంగ్లండ్‌లో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ఒప్పందం ప్రకారం ఇంగ్లండ్‌లో జరపాల్సి ఉండటంతో సౌతాంప్టన్‌కు మ్యాచ్‌ను తరలించారు. ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో ఇరు జట్లు తుది పోరులో తలపడతాయి. స్టేడియం లోపలి భాగంలోనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండటంతో ‘బయో బబుల్’ ఏర్పాటు చేసేందుకు ఇది సరైన చోటుగా ఐసీసీ భావించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తాను మ్యాచ్ చూసేందుకు వెళ్లనున్నట్లు కూడా అతను వెల్లడించాడు. ‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నేను వెళుతున్నాను. విరాట్ కోహ్లి సారథ్యంలోని మన జట్టు విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్‌ను ఓడించగలదనే నమ్మకముంది. మనకంటే ముందే అక్కడికి చేరే న్యూజిలాండ్ రెండు టెస్టులు కూడా ఆడుతుంది’ అని గంగూలీ స్పష్టం చేశాడు. మే 30న ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌కు వెళుతుంది. ఐసీసీ ఇప్పటికే సదరు హోటల్ మొత్తాన్ని జూన్ 1 నుంచి 26 వరకు బుక్ చేసేసింది. అక్కడే టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పాటించాల్సి ఉంటుంది. టీమిండియాపై గంగూలీ ప్రశంసలు భారత జట్టు ఇటీవల సాధించిన విజయాల పట్ల గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్లుగా రహానే, కోహ్లి పనితీరును అభినందించాడు. యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ ఇలాం టి ఫలితాలు సాధించడం నిజంగా అద్భుతం. బ్రిస్బేన్‌లో విజయం గురించి ఎంత చెప్పినా తక్కు వే. బుమ్రా లేకుండా ఆ మ్యాచ్ గెలిచాం. నా దృష్టి లో సెహ్వాగ్, యువరాజ్, ధోని తరహాలో ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా పంత్‌లోనూ ఉంది. ఇక రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటంలో ద్రవి డ్ పాత్ర కూడా గొప్పది’ అని గంగూలీ అన్నాడు. -
వరల్డ్‌కప్‌లో అష్టావక్ర మైదానాలు!
లండన్ : ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ జరుగుతున్న 11 వేదికలు ఇవి... రూపంలో కానీ, బౌండరీ కొలతల విషయంలో కానీ ఒక్క సౌతాంప్టన్ మినహా ఎక్కడా మైదానాలు సరైన రూపంలో లేవు. వేర్వేరు కారణాలతో బౌండరీ లైన్లు కూడా క్రమపద్ధతిలో లేవు. పిచ్ నుంచి ఒకవైపు సాగదీసినట్లున్న లీడ్స్లాంటి చోట ఇరు వైపుల ఉండే బౌండరీ దూరాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇక పరుగుల వరదకు కేంద్రమైన నాటింగ్‌హామ్ గ్రౌండ్లో మిడ్‌వికెట్ బౌండరీ 64 మీటర్లే ఉండగా, ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో కూడా అన్నింటికంటే తక్కువగా 60 మీటర్లకే బౌండరీ లైన్ ఉంది. టోర్నీలో మైదానం కోణాలు, బౌండరీ దూరాన్ని బట్టి కూడా ప్రతీ జట్టు తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే. ఈ అష్టావక్ర మైదానాలపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రోస్‌బౌల్ మైదానం(సౌతాంప్టన్)లా రోటీ చేద్దామనుకున్నా.. కానీ అది హెడింగ్లీ (లీడ్స్) మైదానంలా అయ్యింది. మీ రోటీ ఏ మైదానంలా ఉంది?’ అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ మైదానాలకు సంబంధించి ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. అభిమానులు వంకరటింకరగా ఉన్న మైదాలనుద్దేశించి కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఇక చిన్న మైదానమైన నాటింగ్‌హామ్‌లో రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఎన్ని రికార్డు పరుగులు నమోదవుతాయో చూడాలి! View this post on Instagram While making roti, i tried making Rose Bowl, but at best ended with Headingley. What’s your Roti status ? A post shared by Virender Sehwag (@virendersehwag) on Jun 8, 2019 at 10:45pm PDT -
ఆసీస్‌దే తొలి వన్డే
59 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి సౌతాంప్టన్ : మాథ్యూ వేడ్ (50 బంతుల్లో 71 నాటౌట్; 12 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (67 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించడంతో గురువారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 59 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. రోస్ బౌల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు చేసింది. బర్న్స్ (44), వార్నర్ తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. స్మిత్ (44), మార్ష్ (40 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. వార్నర్, స్మిత్ రెండో వికెట్‌కు 57 పరుగులు జోడిస్తే.. చివర్లో వేడ్, మార్ష్‌లు ఏడో వికెట్‌కు 13 ఓవర్లలో అజేయంగా 112 పరుగులు సమకూర్చడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటై ఓడింది. రాయ్ (64 బంతుల్లో 67; 11 ఫోర్లు) టాప్ స్కోరర్. టేలర్ (49), మోర్గాన్ (38) మినహా మిగతా వారు నిరాశపర్చారు. టాప్ ఆర్డర్ నిలకడతో ఓ దశలో ఇంగ్లండ్ 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. అయితే మిడిల్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో 52 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్, కోల్టర్‌నీల్, కమిన్స్, వాట్సన్ తలా రెండు వికెట్లు తీశారు. వేడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.