సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతతో, మానవత్వంతో ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంటే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు కడుపు మంటగా ఉందని, అందుకే లేనిపోని విమర్శలు చేస్తూ సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో 16% నిధులు కేటాయిస్తున్నారన్నారు. జగనన్న విద్యాకానుక పథకంలో కేంద్రం నిధులు ఉన్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేస్తుండటం విచారకరమని, పథకానికి రూ.648.10 కోట్లు ఖర్చు అవుతుండగా కేంద్రం నిధులు 169.41 కోట్లు మాత్రమే ఇస్తోందని తెలిపారు. తక్కినదంతా రాష్ట్రమే భరిస్తోందన్నారు. టీడీపీ నాయకులు వారి విమర్శలపై చర్చకు సిద్ధమా? ధైర్యముంటే చర్చకు రండి.. అని సవాల్ విసిరారు.
ప్రజలకు మేలు జరుగుతుంటే టీడీపీ నేతలకు కడుపు మంట
Published Sun, Oct 11 2020 4:52 AM | Last Updated on Sun, Oct 11 2020 4:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment