
ఈటావా: ప్రధాని మోదీ వారణాసి పర్యటనను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. అవసాన దశలో జనం కాశీలోనే ఉంటారన్నారు. ప్రధాని మోదీ వారణాసి వచ్చారు, కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభాన్ని పురస్కరించుకొని యూపీ ప్రభుత్వం నెల రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించనున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా... ‘మంచిదే. నెల రోజులే ఎందుకు? ఆయన రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి.
చదవండి: మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!
అవసాన దశ సమీపించినపుడు అక్కడేకదా ఉండాలి’ అని అఖిలేష్ ఎగతాళి చేశారు. ‘అబద్ధాలు చెప్పడంలో వాళ్లు దిట్టలు. భగవంతుడి సమక్షంలోనైనా అసత్యాలు మాట్లాడటం ఆపాలి’ అని బీజేపీపై వాగ్భాణాలు సంధించారు. క్రూరమైన, అనాగరిక వ్యాఖ్యలు అఖిలేశ్ మైండ్‌సెట్‌కు అద్దం పడుతున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎస్పీ చీఫ్‌పై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment