సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించింది. సభ ప్రారంభం నుంచి టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయసాగారు. వ్యవసాయంపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు రన్నింగ్ కామెంట్రీ ఇస్తూ.. ఉద్దేశపూర్వంకగా సభలో వివాదం రాజుకునేట్లు ప్రవర్తించారు. బాబాయ్-గొడ్డలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక.. చెల్లిని మోసం చేశారంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ సజావుగా జరిగే చూడాలి అని స్పీకర్ కోరినప్పటికి టీడీపీ నేతలు వినిపించుకోలేదు.
(చదవండి: ప్రతిపక్షం.. పలాయనం )
ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులు టీడీపీ తీరును తీవ్రంగా ఖండించారు. తాము టీడీపీ నేతల్లా మాట్లాడిల్సి వస్తే.. చాలా అంశాలను మాట్లాడాల్సి వస్తుందని అధికార పార్టీ సభ్యులు తెలిపారు. ఈలోగా టీడీపీ హైడ్రామాకు తెర తీసింది. లేని విషయాలు జరిగినట్లుగా ప్రచారం చేయసాగింది.
(చదవండి: సీఎం జగన్ వల్లే మహిళా సాధికారత)
అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రస్తావన చేయకుండానే.. తన భార్య గురించి ప్రస్తావించారని చంద్రబాబు ఆక్షేపించారు. సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సభలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఒక మెసేజ్‌ను పంపించి.. అతి చేయసాగింది.
Comments
Please login to add a commentAdd a comment