AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Politics And Election Live Updates May 3rd | Sakshi
Sakshi News home page

AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Fri, May 3 2024 7:10 AM | Last Updated on Fri, May 3 2024 7:54 PM

AP Politics And Election Live Updates May 3rd

Andhra Pradesh Election Updates 3rd May..

7:10 PM, May 3rd, 2024

అనకాపల్లి:

కూటమిలో కొట్లాట

  • యాదవ యువకుడిపై అచ్యుతాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి  సుందరపు విజయ్ కుమార్ అనుచరులు దాడి
  • కూటమి ఆధ్వర్యంలో యాదవ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం లో  కొట్లాట
  • భోజనాలు వద్ద టిడిపి సీనియర్ యువ నాయకుడు గోలగాని నాయుడుకి,  జనసేన పార్టీ కార్యకర్తకు మధ్య  కొట్లాటసుందరపు విజయ్ కుమార్ చూస్తుండగానే ఆయన పిఏ,  అనుచరులు టిడిపి నాయకులు పై దాడి
  • టిడిపి నాయకుడు గోలగాని నాయుడిని గదిలో నిర్బంధించి దాడి
  • అచ్యుతాపురం పోలీసులకి ఫిర్యాదు చేశారు టిడిపి నాయకులు
     

6:40 PM, May 3rd, 2024

నెల్లూరు

నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

  • దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌, సీఎం వైఎస్‌ జగన్‌ దయ వల్లే మైనార్టీలకు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభించింది.
  • గ్రామాల రూపురేఖలు మారాయి.. కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తుంది.
  • మా ప్రచారాలకు  అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది
  • మరోసారి సీఎం జగన్‌ సీఎం కావాలని కువైట్‌, సౌదీ, అమెరికా, లండన్‌ నుంచి వచ్చామని ఎన్‌ఆర్‌ఐలు వెల్లడి
     

6:18 PM, May 3rd, 2024

విజయవాడ:
ఈ నెల 6, 8 తేధీలలో ప్రదాని మోదీ ఏపీ పర్యటన

  • 6వ తేధీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజర్గాల పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • 8వ తేదీ రాజంపేటలో బహిరంగ సభ...సాయంత్రం‌ విజయవాడ రోడ్‌ షోలో పాల్గొననున్న ప్రధాని మోదీ

4:46 PM, May 3rd, 2024

గుడివాడ:
వారిని చిత్తుచిత్తుగా ఓడించాలి: కొడాలి నాని

  • గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం
    ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని
  • జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలి
  • పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లపై నాకు.... సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ
    అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాము
  • పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు
  • అన్న ఎన్టీఆర్ వారసులు.... అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు
  • పదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం
  • మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.... లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు
  • అభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.... ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారు
  • ఎన్టీఆర్‌ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి
  • చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.... పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి 
    వస్తాయి
  • ఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను  వెన్నుపోటు పొడిచారో.... పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారు
  • పెద్ద ఎన్టీఆర్‌కు  దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.... జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్‌ మీడియాలో తిట్టిస్తున్నారు
  • నేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.... నందమూరి హరికృష్ణ నా గురువు... నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.
  • నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.... వైఎస్సార్‌ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.
  • ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.... వారికోసం నేను.... నాకోసం వారు అనేక త్యాగాలు చేశారు
  • ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ నాకు రెండు కళ్లు
  • తెలుగుదేశం పార్టీ గౌడ.... యాదవ....మత్స్యకార.... ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.... కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.
  • సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి... అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాకరాజ్యసభ స్థానాలు ఇస్తూ.... ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.
  • ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి
     

4:15 PM, May 3rd, 2024

కనిగిరి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ స్పీచ్‌

  • ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌
  • జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు
  • పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే
  • బాబుని నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే
  • లకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడు
  • చంద్రబాబు హయాంలో పెన్షన్‌ వెయ్యి రూపాయలు
  • రూ. వెయ్యి పెన్షన్‌ను రూ. 3 వేలు చేసింది మీ బిడ్డ జగన్‌
  • 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్‌ ఇచ్చాడు
  • మీ బిడ్డ జగన్‌.. 66  లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాడు
  • లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ ఇస్తున్నాం
  • చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వా తాతలపై పడ్డాయి
  • ఎండలో క్యూలో నిలబడి నానా అగచాట్లు పడుతున్నాడు
  • ఈ దుర్మార్గ బాబు ఆ నెపాన్ని మనపై వేస్తున్నాడు
  • నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్‌ను అడ్డుకున్నాడు
  • అవ్వా తాతలు బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేశాడు
  • అవ్వా, తాతలు ఒక నెల ఓపెక పట్టండి
  • మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా
  • వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇస్తారు

3:50 PM, May 3rd, 2024

175కి 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు: సీఎం జగన్‌ ట్వీట్‌

 

3:40 PM, May 3rd, 2024

కృష్ణాజిల్లా:

మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన అల్లరిమూకల దాడి

  • దాడి ఘటన లో జనసేన నాయకుడు కర్రి మహేష్‌తో పాటు మరో ముగ్గురి పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు

3:00 PM, May 3rd, 2024

కృష్ణాజిల్లా :

గన్నవరంలో టీడీపీకి మరో షాక్.

  • గన్నవరం మండల టీడీపీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ మోదుగుమూడి రాజేశ్వరితో పాటు మరో 30 మంది మహిళా కార్యకర్తలు వైసీపీలో చేరిక.
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.

2:59 PM, May 3rd, 2024

వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు
నరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో  సీఎం జగన్‌  ఎన్నికల‌ ప్రచార సభ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన నేరెళ్ల సురేష్‌

2:58 PM, May 3rd, 2024

కృష్ణాజిల్లా

అవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం

  • పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు, కుమారుడు వికాస్ బాబు
  • సమావేశానికి భారీగా హాజరైన గ్రామస్తులు
  • సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరిన పాత ఎడ్లంక గ్రామానికి చెందిన 100 కుటుంబాలు
  • వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు

2:53 PM, May 3rd, 2024

విజయవాడ
బెజవాడ బార్ అసోసియేషన్ లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆత్మీయ సమావేశం

  • తూర్పు, పశ్చిమ, సెంట్రల్ అభ్యర్థులు అవినాష్, ఆసిఫ్, వెల్లంపల్లికి మద్దతు తెలిపిన న్యాయవాదులు
  • తమ సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల న్యాయవాదుల హర్షం

2:51 PM, May 3rd, 2024

తిరుపతి జిల్లా:

పిచ్చాటూరు సచివాలయం పరిధిలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా

  • ఎంపీడీఓ కార్యాలయానికి వాలంటీర్లు చేరుకొని తమ రాజీనామా పత్రాలను ఏఓ రాధా రాణికి సమర్పించారు.
  • ప్రజలకు అంకిత భావంతో సేవలు  అందిస్తున్న తమను తెలుగుదేశం, జనసేన పార్టీలు తమను కించపరిచే విధంగా మాట్లాడడం జీర్ణించుకోలేక తాము రాజీనామా నిర్ణయం తీసుకున్నాం..వాలంటీర్లు
  • జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన


నరసాపురం రోడ్‌ షోలో సీఎం జగన్‌ కామెంట్స్‌..
1:00 PM, May 3rd, 2024

  • పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. 
    చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. 
    చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 
    14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. 
    టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. 
    చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. 
    చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే.
  • మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. 
    ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్‌ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. 
    మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్‌. 
    బాబు పాలనలో ఇంటికే పెన్షన్‌ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?.
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌ కంటెంట్‌. 
    ఇంగ్లీష్‌ మీడియంతో అడుగులు సీబీఎస్‌సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. 
    ఆరో తరగతి నుంచే క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోధన అందుతోంది. 
    ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్ధులకు బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌. 
    రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 
    జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. 
    ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం.
  • మీ బిడ్డ జగన్‌.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. 
    అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. 
    ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. 
    అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 
    31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. 
    ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.
  • రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 
    సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిబీ అందిస్తున్నాం. 
    విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.
  • పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 
    పేషంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. 
    ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. 
    నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. 
    జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. 
    గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. 
    రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. 
    రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. 
    చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. 
    రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. 
    రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.
    డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. 
    రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌.

 

వారిద్దరి వల్లే పెన్షనర్లకు అవస్థలు: మల్లాది విష్ణు
12:30 PM, May 3rd, 2024

  • నేటి నుంచి స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి పార్టీ పిలుపునిచ్చింది
  • ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రమంతా ప్రచారం చేస్తారు
  • ఇంటివద్దకే పెన్షన్‌ను సీఎం జగన్ ఐదేళ్ల పాటు అందించారు
  • చంద్రబాబు దుర్భుద్ధితో పెన్షన్లు అందకుండా చేశాడు
  • ఈరోజు పెన్షనర్లు బ్యాంకుల వద్ద నానా అవస్థలు పడుతున్నారు
  • ఈ పాపం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లదే. 

 

వంగా గీత గెలుపు ఖాయం: నటి శ్యామల
11:50 AM, May 3rd, 2024

  • వైఎస్సార్‌సీపీ నాయకురాలు, సినీ నటి శ్యామల
  • వంగా గీత గెలుపు ఖాయం అయిపోయింది.
  • అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు మిగితా సినిమా వాళ్ళని తీసుకొస్తున్నారు.
  • చాలా సీనియర్ నాయకురాలు వంగా గీత.
  • ఆమెను ఓడించడం ఎవరి వల్ల కాదు.
  • వంగా గీత ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారో అందరికీ తెలుసు.
  • వంగా గీతకు భారీ మెజారిటీ కోసం నేను కూడా ప్రచారం చేస్తున్నాను.
  • పిఠాపురం ప్రజలు అభివృద్ది చేసే వారికి ఓటు వేయండి.
  • ఆ అభివృద్ది సీఎం జగన్, వంగా గీత వల్లనే సాధ్యం.

 

 

టీడీపీ నేతల కారణంగానే వృద్దులకు ఇబ్బందులు..
10:30 AM, May 3rd, 2024

  • దేవినేని అవినాష్ కామెంట్స్‌..
  • డివిజన్‌లోని ప్రతీ గడపలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు
  • వైఎస్సార్‌సీపీకి ఓటు వేయడానికి సిద్ధం అని ప్రతీ మహిళా చెబుతున్నారు
  • పెన్షన్ కోసం వృద్దుల ఇబ్బందులకు చంద్రబాబు కారణం కాదా?.
  • టీడీపీ నేతల ఫిర్యాదు వలనే నేడు వృద్ధులకు ఇబ్బందులు.
  • ఈనాడును అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే టీడీపీ నేతల లక్ష్యం
  • స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడుతున్నారు
  • ప్రజలు ఏం తప్పు చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు
  • టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ప్రతీ కాంట్రాక్టు ఎంఎల్ఏ తమ్ముడు రమేష్‌వే కాంట్రాక్టులు
  • కరకట్ట ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమే
  • రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి

 

'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం
8:30 AM, May 3rd, 2024
తాడేపల్లి :

  • రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం
  • ఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారం
  • ఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులు
  • పేదలే వైఎస్సార్‌సీపీ స్టార్ క్యాంపెయినర్లు
  • ఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీ
  • వారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలు

    పవన్‌కు పిచ్చి పీక్స్‌లో..
    7:45 AM, May 3rd, 2024
  • పదవి వస్తుందో రాదో అని పవన్‌కళ్యాణ్‌ నిర్వేదం
  • యువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..
  • వైఎస్సార్‌సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా
  • ‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు
  • విశాఖ ఎన్నికల సభలో పవన్‌కళ్యాణ్‌ 
     

 

హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..
7:25 AM, May 3rd, 2024

  • హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
  • వైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
  • ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు
  • ఆసుపత్రికి తరలింపు
  • టీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

 

నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..
7:10 AM, May 3rd, 2024

  • మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్‌
  • ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార సభ
  • మధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభ
  • మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం. 
     

 

దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే
7:00 AM, May 3rd, 2024
 

  • కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్‌
  • తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనే
  • లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి
  • బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేత
  • తిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠా
  • బరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబు
  • ఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్‌
  • అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణ
  • అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహం
  • మార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికి
  • ఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుం
  • పంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటి
  • నియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్‌
  • పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే  

 

మోసాల బాబు మరో అబద్ధం..
6:50 AM, May 3rd, 2024

  • ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 
  • 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది 
  • ఇంటర్‌ విద్యార్థులు మరో 10,52,221 మంది.. 
  • ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం  
  • ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు  
  • ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం  
  • పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు 
  • ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం   

 

ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రెస్‌ మీట్‌
6:40 AM, May 3rd, 2024
 

  • రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారు
  • పురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137
  • దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు
  • రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
  • మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు 
  • సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయి
  • కొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలు
  • ఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్
  • రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం
  • 14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్
  • ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు
  • 85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారు
  • హైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\
  • విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయి
    తిరుపతి, మంగళగిరిలలో  మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయి
  • ఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాం
  • రాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు,  అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారు
  • పోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత  కల్పించాం
  • పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల‌కమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాం
  • బ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాం
  • పెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేను
  • నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యింది
  • అలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల  తుది జాబితాను కూడా సిద్ధం చేశాం
  • ప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు
  • గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారు
  • ఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయి
  • మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాం
  • అలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాం
  • ఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం
  • ఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాం
  • అలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాం
  • మాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం
  • ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి
  • అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాం
  • రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారు
  • జనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదు
  • అలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వం
  • ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాం
  • ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాం
  • పెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం

 

 

 

చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి
6:30 AM, May 3rd, 2024
 

  • చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసు
  • వైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోంది
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాం
  • కోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాం
  • జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారు
  • ఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు
  • గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారు
  • నిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారు
  • కానీ అర్హత ఏంటో చెప్పలేదు
  • అంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?
  • 1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారు
  • కానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారు
  • చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారు
  • అదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదు
  • వృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు
  • ఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారు
  • చివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారు
  • బ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోంది
  • చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోంది
  • వృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదే
  • వాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు
  • 2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉంది
  • అందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారు
  • కూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?
  • అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?
  • సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?
  • చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయింది
  • అందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారు
  • ఆ యాక్టును బీజేపీ కేంద్ర  ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోంది
  • ఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదే
  • తప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడు
  • చంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రం
  • ల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి
  • బీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?
  • చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?
  • దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement