అమరావతి: ఒకవైపు చంద్రబాబు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా టీడీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు జైలు అంశాన్ని అటు ఉంచితే, ఇప్పుడు పార్టీలో బాబు తర్వాత ఎవరు దానిపైనే ఇప్పుడు చర్చ ఎక్కువైపోయింది. మొత్తం ఎపిసోడ్ అంతా బాలకృష్ణ, లోకేష్, అచ్చెన్నాయుడు చుట్టూనే తిరుగుతుంది.
చంద్రబాబు అరెస్టై జైలుకెళ్లిన తర్వాత టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో బావ చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చోవడమే ఇప్పుడు ఆ పార్టీలో పోరుకు దారి తీసేటట్లు కనిపిస్తోంది. ఈరోజు(మంగళవారం) టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చోలేదు. రెండో సమావేశం నాటికే బాలయ్యను పక్కన పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇది చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందా? అనే కోణంలోనే ఎక్కువ చర్చ నడుస్తోంది. అప్పుడు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పుడు బాలయ్యను ఇలా అవమానించారా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో టాపిక్‌గా మారింది.
రానున్న రోజుల్లో టీడీపీని బాలకృష్ణ నడిపిస్తారనే దానిపైనే ఎక్కువ చర్చ నడిచే క్రమంలో ఆయన్ను ఇలా రెండో సమావేశం నాటికే సీట్లు కూర్చోకుండా చేయడం వెనుక కుట్ర జరుగుతుందనే వాదన కూడా ఉంది. చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న వార్త ఎల్లో మీడియా కవర్ కాకుండా చూడటం కూడా తెర వెనుక పావులు కదిపినట్లే తెలుస్తోంది. ఇది బాలకృష్ణకు వెన్నుపోటా? అనేది అభిమానుల్లో ఒక ప్రశ్నగా తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment