బీఆర్‌ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి సూచన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్ దీక్ష చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఏడు మండలాలు ఏపీకి పోవడానికి కారణం బీఆర్‌ఎస్, బీజేపీ, కేసీఆరే కారణమని చెప్పారు. గాందీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావనే లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వబీఆర్‌ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి సూచనన తర్వాత ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని తెలిపారు.
ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ త్వరలోనే అమలు చేస్తామని, రైతులు అప్పుల చేయకుండా సహాయం అందిస్తామని తెలిపారు. ఈ నెల 6న ఏపీ, తెలంగాణ రాష్ట్ర సీఎంల సమావేశంలో పదేళ్ల పెండింగ్ సమస్యలను చర్చిస్తారని వివరించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం నిర్ణ యం తీసుకుంటుందని తెలిపారు.
టీపీసీసీ నూతన అధ్యక్షుడి విషయంలో కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. రైతు భరోసాపై సబ్ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులను శిక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
సీఎంల భేటీకి ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎ.రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్‌ను సందర్శించారు.
సమన్వయంతో సమావేశానికి తగు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment