న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జాతీయ కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. ఢీల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. జనవరి 16,17 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండాతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్టీలో సంస్థాగతమైన మార్పులు, జీ20కి భారత్ అధ్యక్షత వాహించడం వంటి విషయాలపై పార్టీ నాయకులతో నడ్డా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
చదవండి: రాహుల్ గాంధీకి ఆ సత్తా ఉంది: టీఎంసీ నేత
Comments
Please login to add a commentAdd a comment