
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. జనసేన పార్టీకి ఒక విధానం లేదని విమర్శించారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే వ్యవస్థలు సహించవన్నారు. అందరూ చెప్పులు చూపిస్తే నువ్వు ఏమవుతావ్ అని పవన్‌ను ప్రశ్నించారు. టీడీపీతో టై అప్ అయ్యారు కాబట్టే పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటున్నారని పేర్కొన్నారు. తాను ప్యాకేజ్ స్టార్ కాదని ఆయన నిరూపించుకోవాలన్నారు.
పవన్ చంద్రబాబు దత్తపుత్రుడని వైఎస్సార్‌సీపీ మొదట్నుంచి చెబుతూనే ఉంది. మేం చెప్పింది నిజమేనని నిన్నటి భేటీతో నిరూపితమైంది. టీడీపీకి జనసేన బి పార్టీ. జనసేన రాజకీయ పార్టీ కాదు.. సెలిబ్రిటీ సంస్థ. పవన్ లాంటి వాళ్ళ వలనే రాజకీయ నాయకులు పలచనైపోతున్నారు. పవన్ అన్నయ్య చిరంజీవి ఎంత గౌరవంగా ఉన్నాడు. అని బొత్స వ్యాఖ్యానించారు.
చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి సిగ్గుపడుతుంది. చంద్రబాబు అవినీతి, దోపిడీలకు ఒక చిహ్నంలా ఉన్నాడు. రాజధాని రైతుల ముసుగులో వస్తున్నవారిని సమర్ధించను. వాటర్ బాటిళ్ళు మా వాళ్ళు వేయలేదు. వాటర్ బాటిళ్ళు వాళ్ళ వైపు నుంచే వచ్చాయి. అది టీడీపీ పాద యాత్ర... రైతుల పాదయాత్ర కాదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అని బొత్స పేర్కొన్నారు.
చదవండి: అందుకే పవన్‌ను చంద్రబాబు వెంట బెట్టుకున్నారు: మంత్రి రోజా
Comments
Please login to add a commentAdd a comment