సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్టు పాలన నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుంటే ఉద్యమం చేస్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇక, తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ, ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.…
— Harish Rao Thanneeru (@BRSHarish) February 22, 2024
Comments
Please login to add a commentAdd a comment