
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీల తరహాలోనే దావోస్ పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆరు గ్యారంటీల పేరిట హంగామా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 12 వేలకుపైగా గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 600 గ్రామాల్లో పథకాల అమలు పేరిట స్థానికసంస్థల్లో ఓట్ల కోసం కొత్త మోసానికి సీఎం రేవంత్ తెరలేపారని దుయ్యబట్టారు. గతేడాది దావోస్ నుంచి వచ్చిన రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటివరకు ఏదీ వాస్తవరూపం దాల్చలేదని.. ఒకవేళ ఆ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే తామే సీఎం రేవంత్‌కు సన్మానం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం డైరీ, కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
సీఎం సహా కేబినెట్‌వి పచ్చి అబద్ధాలు
‘వంద రోజుల్లో హామీల అమలు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలల్లోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క సహా కేబినెట్ మంత్రులు, నేతలు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. బాండ్ పేపర్లు, అఫిడివిట్లతో గోబెల్స్ సిగ్గుపడేలా ప్రచారం చేసిన సీఎం.. రేషన్‌కార్డులు ఇవ్వడాన్ని కూడా చారిత్రక కార్యక్రమం అనే భావదారి్రద్యంలో ఉన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో 6.47 లక్షల రేషన్ కార్డులను ఇచ్చాం’అని కేటీఆర్ తెలిపారు.
డూప్లికేట్ గాంధీ వైఫల్యాలు ఎండగట్టాలి
డూప్లికేట్ గాందీలు ఇచ్చిన దొంగ హామీలు, వైఫల్యాలను ఎండగట్టాలని విద్యార్థులు, యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు వివిధ హామీలిచ్చి 400 రోజులు గడిచిన సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు నివాళులు అరి్పంచాలని సూచించారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, పార్టీ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, చిరుమల్ల రాకేశ్, బాలరా>జు యాదవ్, ఆంజనేయ గౌడ్, రాజారాం యాదవ్, శుభప్రద్ పటేల్, తుంగ బాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment