
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయినట్టు సమాచారం.
బీఆర్‌ఎస్‌కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈనెల ఆరో తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్‌ఎస్ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్సీలు, మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment