![Central Minister Amit Shah Hyderabad Visit Updates In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/28/amit-shah.jpg.webp?itok=AJbqCttF)
(ఫైల్ ఫొటో)
Amit Shah Tour At Hyderabad LIVE Updates
► కొంగరకలాన్ బయలుదేన కేంద్ర మంత్రి అమిత్ షా
► చార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
► అమిత్ షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
► భాగ్య లక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు
► శంషాబాద్ నోవొటెల్ నుంచి ఛార్మినార్ బయల్దేరిన అమిత్ షా
► బీజేపీ ముఖ్య నేతలతో ముగిసిన అమిత్ షా సమావేశం
► బీజేపీ ముఖ్యనేతలకు అమిత్ షా క్లాస్
► ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండి
► పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి
► నేతల మధ్య గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది రిపీట్ అవ్వొద్దు
► తెలంగాణలో లోక్ సభ సిట్టింగ్ ఎంపీలు అదే స్ధానంలో పోటీ చేసేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్.
► నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా
► కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు.
►శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి మరికాసేపట్లో కేంద్ర హోం మంత్రి బయలుదేరనున్నారు.
►అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న అమిత్ షా. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు.
►భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి నేరుగా కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్ హాల్‌కు అమిత్ షా వెళ్లనున్నారు.
► శంషాబాద్ నోవోటెల్‌లో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు.
► సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బండి సంజయ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, రాష్ట్ర ఇంచార్జ్ అరవింద్ మీనన్, గరికపాటి మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి,పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
► కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ నుంచి ఆయన నోవాటెల్ హోటల్‌కు వెళ్లనున్నారు. అదే విధంగా చార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. కొంగరకలాన్‌లో బీజేపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. సమావేశ అనంతరం ఆయన కొత్తగా గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment