Live Updates..
కాసేపట్లో తాడిపత్రికి చేరుకోనున్న సీఎం జగన్
తాడిపత్రి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
- నేటి నుంచి మలివిడత ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న సీఎం జగన్
- నేడు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం జగన్
⇒పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.
⇒రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు.
⇒అనంతరం.. మ.12.30కు తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌లో నిర్వహించే బహిరంగసభలోనూ.. అలాగే, మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు.
⇒సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయి.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయాజోష్..
⇒ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment