సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది బీఆర్‌ఎస్ పార్టీ. కర్ణాటక ఫలితాల తర్వాత మంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్..తెలంగాణలో కూడా దూసుకుపోవాలని తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కొందరు కీలక నేతలు కాంగ్రెస్‌పై మొగ్గుచూపిస్తుండటం కూడా ఆ పార్టీలో మరింత ఉత్తేజాన్ని తీసుకొస్తోంది.
ఇప్పటివరకూ తెలంగాణలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అనుకున్న బీఆర్‌ఎస్.. బీజేపీ కంటే కాంగ్రెస్ నుంచే ప్రమాదం పొంచి ఉందని భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.
Not at all surprised to see that this is all the Congress Party had instead of an actual and factual rebuttal in their defence.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 9, 2023
Truth is, no party has any counter for the proven Governance Model of CM KCR and BRS Government. Also, with a pinch of salt you’ll agree the world… https://t.co/8jSkDHAv20
కాంగ్రెస్ నేతలు టూరిస్టులు.. అవి గుర్తించుకుంటే మంచిది
తాజాగా బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్‌పై విమర్శల దాడికి దిగింది. ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు కవిత. టూరిస్టులు అంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటిచారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాస్తవాలను గమినించలేదని మండిపడ్డారు. తెలంగాణలో ఏ పార్టీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను విమర్శించే నైతికలేదంటూ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పరిపాలనా మోడల్‌ను చూస్తే ఎవరికీ విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను,కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రతి పౌరుడు, "టూరిస్టులు" ప్రశంసించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకుంటే మంచిదనిహితవు పలికారు.
-నరేష్‌బాబు, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment