అక్రమ కేసులు పెట్టడానికేనా ఎర్ర బుక్‌?: పేర్ని నాని | Ex Minister Perni Nani Satirical Comments On Chandrababu Naidu Govt, More Details Inside | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం పవన్‌కు అన్ని శాఖలు అవసరం లేదా?: పేర్ని నాని

Jul 12 2024 3:48 PM | Updated on Jul 12 2024 5:24 PM

Ex Minister Perni Nani Satirical Comments On Chandrababu Govt

సంపద సృష్టిస్తానని చెప్పి చేతులెస్తిన చంద్రబాబు

అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని, అగాధాలు సృష్టించారు

ఎర్ర బుక్‌లో రాసినవన్నీ అక్రమ కేసులే..

పోలవరం నాశనం చేసిందే చంద్రబాబు

షర్మిల ఎవరి కోసం పనిచేస్తుందో అందరికీ తెలుసు

వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉంటే పథకాలకు నిధులు ఇచ్చేవారు

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అలాగే, ప్రతీరోజు ఏదో ఒకదానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, పేర్ని నాని శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. రాష్ట్రంలో కూటమి నేతలు శ్వేతపత్రాల విడుదల పేరుతో అబద్దాలు చెబుతున్నారు. హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు బిల్లులు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారు. ట్రూఅప్ ఛార్జీలు గురించి విలేకరులు అడిగితే నేనెప్పుడు ఆమాట అన్నాను అన్నారు. అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు

సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.. ఏమైంది?. అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు అనేక సార్లు మాట్లాడారు. 2019లో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదు. అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. ఎర్రబుక్‌ అక్రమ కేసులు పెట్టడానికేనా?. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు. ఆయన నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది. చంద్రబాబు, బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారు. నచ్చినోళ్లకు కాంట్రాక్ట్‌లు ఇచ్చి ప్రాజెక్ట్‌ను నాశనం చేశారు.

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రతీ పిల్లాడికి రూ.15వేలు ఇస్తామన్నారు.. ఏమైంది?. రాష్ట్రంలో పిల్లలు హ్యాపీగా లేరు.. మంత్రి మాత్రం హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం.. పిల్లలకు పంగనామాలు పెట్టి జనాన్ని మోసం చేశారు. ఆరడగుల అబద్ధం చంద్రబాబు.  కూటమి అంతా హ్యాపీగా ఉంటే కాదు.. ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. 

ఉచిత ఇసుక అంటారు.. వెంటనే డబ్బులు కట్టమంటారు. ఎప్పుడో జరిగిన ఘటనలపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు.ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేం చేయలేమని చెప్పడం విడ్డూరం. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ మాటలు కోటలు దాటించారు. ఉచితం పేరుతో మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసమే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారు.

"ఆరడుగుల అబద్దం..' పేర్ని నాని నాన్ స్టాప్ కోటింగ్

 అధికారం లేనప్పుడు చంద్రబాబుకు ప్రజలపై వినయం, ప్రేమ ఉంటుంది. అధికారం రాగానే బాబు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కనుక వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలో ఉంటే అమ్మఒడి తల్లుల ఖాతాల్లో​ వేసేవారు. విద్యాదీవెన, వసతి దీవెన లబ్దిదారుల ఖాతాల్లో పడేవి. ముగ్గురూ కలిసి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. 

కూటమి బాస్ అయిన బీజేపీ వారే ఏపీ రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు చెప్పింది. కానీ, చంద్రబాబు మాత్రం పది లక్షల కోట్లు అంటూ అబద్దాలు చెప్తున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేతులెత్తేశారు. వైఎస్‌ జగన్ సీఎం అయ్యేనాటికే ఖజానా ఖాళీ అయింది. ఇక అప్పు కూడా పుట్టదని యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి నేతలంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. పంచాయతీరాజ్‌ శాఖ తప్ప మరో శాఖ వైపు పవన్‌ చూడటం లేదు. షర్మిల ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. బీజేపీ, చంద్రబాబు కోసమే షర్మిల రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్లను వదిలేసి, మమ్మల్ని ప్రశ్నించడమేంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement