Dec 20: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా | First Session of Third Telangana Legislative Assembly Day 05 Updates | Sakshi
Sakshi News home page

Dec 20: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

Published Wed, Dec 20 2023 7:46 AM | Last Updated on Wed, Dec 20 2023 8:39 PM

First Session of Third Telangana Legislative Assembly Day 05 Updates - Sakshi

First Session of Third Telangana Legislative Assembly Day 5 Live Updates

తెలంగాణ అసెంబ్లీ రేపటికి(గురువారానికి) వాయిదా

హరీష్‌ రావు కామెంట్స్‌..

  • పదవుల కంటే వ్యవస్థలు ముఖ్యం. 
  • ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది మేము. 
  • రేవంత్ రెడ్డి సీఎంగా కాకుండా పీసీసీ అధ్యక్షులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • సభను, రాష్ట్ర ప్రజలను శ్వేత పత్రం ద్వారా కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు.
  • ఎన్ని వైట్ పేపర్లు అయినా పెట్టినా మాకు అభ్యంతరం లేదు.
     

సత్యహరిచంద్రుడిలా హరీష్‌రావు మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్‌

  • సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. 
  • లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు నీళ్లివ్వలేకపోయారు.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.1.34లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు. 
  • సత్యహరిచంద్రుడిలా హరీష్‌రావు మాట్లాడుతున్నారు. 
  • మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదారి పట్టించారని చెప్పి ఉంటే హరీష్‌ హుందాతనం పెరిగేది. 
  • గత పాలకులంటూ ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు. 
  • ఇంకా మూడువేల కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్‌ చేయాల్సి ఉంది. 
  • రూ.90వేల కోట్లు పేమెంట్స్‌ జరిగాయి. 
  • గత పాలకులు రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వలేదు. 
  • దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు. 
  • హాస్టల్‌లో వంటచేసే వాళ్లకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదు. 
  • పెద్దకొడుకును అన్న కేసీఆర్‌ ఇప్పుడు రెండు, మూడు నెలలకు ఒకసారి పెన్షన్‌ ఇచ్చే పరిస్థితి ఉంది. 
  • పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్స్‌ ఇవ్వలేదు. 
  • లక్షకోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారు. 
  • నాలుగు నెలల తర్వాత పిలవాల్సిన టెండర్లను ఎన్నికలకు ముందే పిలిచారు.

ఓడీ ఏమైనా నేరమా?: హరీష్‌ రావు

  • హరీష్‌ రావు మాట్లాడుతూ..
  • బడ్జెట్‌ గ్యాప్‌ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. 
  • నికర అప్పు రూ.5,16,881కోట్లు
  • అప్పులు చెప్పారు, ఆస్తుల విలువ చేప్పలేదు. 
  • కేంద్ర సంస్థలను కాంగ్రెస్‌ హయాంలో తెచ్చినట్టుగా చెప్పారు.. అది రాష్ట్రానికేం సంబంధం.
  • మీరు భవిష్యత్తులో ఓడీ వాడమని హామీ ఇస్తారా?. 
  • ఓడీ ఏమైనా నేరమా?
  • పెరిగిన జీఎస్‌డీపీ చెప్పలేదు. 
  • 47 లక్షల మంది వృద్ధులు, మహిళలకు పెన్షన్లు ఇచ్చాం.
  • సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. 
  • రూ. ఏడులక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు, అది అబద్దం. 
  • పెరిగిన పంటల ఉత్పత్తి చెప్పలేదు.  

కట్టిందే ఒక్క ప్రాజెక్ట్‌.. అది కూడా కూలిపోయింది: భట్టి విక్రమార్క

  • గత ప్రభుత్వం కట్టిందే ఒక్క కాళేళ్వరం ప్రాజెక్ట్‌.. ఎన్నికలకు ముందే మేడిగ​డ్డ కూలిపోయింది. 
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కారణంగా తెచ్చిన అప్పులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది 
  • రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 
  • ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారు. 
  • దేశంతో తెలంగాణ పోటీ పడాలి అనే ఈ శ్వేతపత్రం. 
  • రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రం. 
  • ఇంతా చేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారు. 
  • ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. 
  • నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలి.
  • ప్రణాళికబద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 
  • మన ముందు పెద్ద సవాల్‌ ఉంది. 
  • మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌ లేదు. 
  • ఏ బడ్జెట్‌లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్‌ ఉంటుంది. 
  • పదేళ్లల్లో ఇన్ని కోట్ల బడ్జెట్‌తో ఏం సాధించారు. 
  • గత ప్రభుత్వ కాలంలో చాలాసార్లు 20శాతం కంటే ఎక్కువగా బడ్జెట్‌లో గ్యాప్‌ ఉంది. 
  • తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారు. 
  • కానీ, అంతా రివర్స్‌ అయ్యింది. 
  • ఆర్థిక పరిస్థితి ఓవైపు.. ప్రజల ఆకాంక్షలు మరోవైపు. 
  • బడ్జెట్‌ అంటే అంకెల గారడీ చేశారు.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారు. 
  • మేం వెళ్లి చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. 
  • కట్టింది ఒక్కటే ప్రాజెక్ట్‌ అది కూడా కూలిపోయింది. 
  • మిషన్‌ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారు. 
  • ప్రాజెక్ట్‌ సెఫ్టీ వాళ్లు మేడిగడ్డ మళ్లీ కట్టాలి అన్నారు. 
  • ఎల్లింపల్లి కూడా మేం కట్టిందే, దాన్ని కూడా మీరు వాడుకున్నారు. 
  • గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పింది.
  • ఓఆర్‌ఆర్‌ కట్టింది మేమే.. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. 
  • మీరు చేసిన దివాళా పని సెట్‌ చేసుకోవడం మాకు కష్టమే. 
  • మీరు చాలా స్వేచ్చగా మాట్లాడవచ్చు. 
  • మాకు కిరీటాలు వచ్చాయనుకోవడం లేదు. 
  • కార్పొరేషన్లు అప్పులు తీర్చవు.. ప్రభుత్వమే అప్పులు తీర్చాలి. 
  • రాష్ట్రంపై మీకంటే ఎక్కువ ప్రేమ మాకే ఉంది. 
  • రాష్ట్రం ఇచ్చిందే మేము.
  • తెచ్చిన అప్పులతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లు కట్టారంటే అది లేదు.
  • కేంద్ర సంస్థలు ఏం తెచ్చారు? వచ్చిన ఐటీఐఆర్‌ను పోగొట్టారు.
  • రెండు ఫామ్‌హౌజ్‌లను మాత్రమే తెచ్చారు. 
  • మా వెన్నులో భయం పెట్టుకునే పని చేస్తున్నాం’ అని అన్నారు. 

ప్రజలకు ఏం మెసేజ్‌ ఇస్తున్నారు: అక్బరుద్దీన్‌ ఫైర్‌

  • తెలంగాణ దీవాలా తీసిందని చెప్పడం సరికాదు
  • రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దు. 
  • కేంద్రం కూడా అప్పులు చేసింది
  • ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని ఎందుకు పెట్టింది. 
  • రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది. 
  • రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెప్పడం వల్ల ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకుంటోంది. 
  • కర్ణాటక అప్పుల లెక్కలను చెప్పిన అక్బరుద్దీన్‌
  • రాంగ్‌ మెసేజ్‌ వెళ్లకూడదనేదే నా ఉద్దేశ్యం
  • ఆర్బీఐ, కాగ్‌, బడ్జెట్‌ లెక్కలను అవసరానికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అక్బరుద్దీన్‌

అప్పులు చేయకూడదన్నది మా ఉద్దేశం కాదు: శ్రీధర్‌ బాబు 

  • అప్పులు చేయకూడదన్నది మా ఉద్దేశం కాదు: శ్రీధర్‌ బాబు 
  • అప్పులు ఎందుకోసం చేస్తామన్నది ముఖ్యం. 
  • ప్రస్తుత పరిస్థితి నుంచి ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఐదేళ్లలో నెంబర్‌ వన్‌గా చేస్తాం. 
  • ఇది ప్రగతి నివేదిక లాంటిదే.
  • దేశంలో తెలంగాణను నంబర్‌ వన్‌గా చేయాలన్నదే మా ఉద్దేశం

మంత్రి పొన్నం వర్సెస్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

  • ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
  • పార్లమెంట్‌లో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘనత బీజేపీది.
  • తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని ఉంటే రూ.500లకే గ్యాస్ ఇవ్వడంలో సహకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  • బీజేపీ పాలనలో పార్లమెంట్‌లో రక్షణ లేకుండా పోయింది
  • కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పు చేసింది: మహేశ్వర్ రెడ్డి
  • శ్వేతపత్రం విడుదల అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు
  • ఇలా చట్టసభల్లో అప్పులు వివరిస్తే భవిష్యత్త్‌లో ఎలా అప్పులు పుడుతాయ్?.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • హరీష్ రావు సివిల్ సప్లై కార్పొరేషన్‌పై చేసిన కామెంట్స్ వాస్తవం కాదు.
  • సివిల్ సప్లై లో అప్పు 3వేల కోట్ల నుంచి 56వేల కోట్లకు చేరింది.
  • గత పదేళ్లలో సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి ఒక్క సబ్సీడీ కూడా ఇవ్వలేదు.
  • రూ.3వేల కోట్ల మిత్తీ ప్రతీ ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్ కట్టాల్సి ఉంది.
  • రూ.22వేల ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉంది.
  • గత నాలుగేళ్లుగా సివిల్ సప్లై ఆడిట్ లేదు.
  • ఆరు కిలోల్లో ఒక కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది.
  • 39 రూపాయలు కిలోకి ఖర్చు చేసింది గత ప్రభుత్వం.
  • 75శాతం రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి.
  • రాష్ట్రం దగ్గర స్టాక్ ఉన్నా కర్ణాటక, తమిళనాడుకు బియ్యం అమ్మలేదు.
  • ప్యాడీ ప్రోకూర్మెంట్ కింద కేంద్రం నిధులు సమయానికి ఇవ్వలేదు.


ఇరిగేషన్‌ శాఖపై ఉత్తమ్‌ కుమార్‌ సంచలన ఆరోపణలు

  • ఇరిగేషన్ శాఖలో చాలా దుర్మంగంగా జరిగింది
  • కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పకుండా విచారణ చేస్తాం
  • తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు
  • లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే
  • పాలమూరు రంగారెడ్డి 25వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు జీరో
  • సీతారామ ప్రాజెక్టుపై 7వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు జీరో
  • మేడిగడ్డ డ్యామేజ్ అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్
  • ప్రపంచ చరిత్రలో ఇలాంటి నిర్లక్ష్యం చూడలేదు
  • డిజైన్ చేసింది ప్రభుత్వమే అని నిర్మాణ ఎల్‌అండ్‌టీ సంస్థ చెప్పింది
  • ఎవరి ఎజెండా అని ప్రశ్నిస్తే.. ఇంకా ఎవరు అన్ని ఆయనే కదా అని ఎల్‌ అండ్‌ టీ వాళ్లు అన్నారు
  • డిజైన్ సరిగ్గా లేదని ఆ సంస్థ చెప్తోంది
  • పెద్ద పెద్ద మాటలు చెప్పారు.. పెద్ద ప్రాజెక్ట్‌.. కానీ ఫలితం లేదు
  • మన కుటుంబాలను తాకట్టుపెట్టి అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టి ప్రయోజనం లేదు
     

అబద్దాలతో హరీష్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

  • తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.
  • అమలు కానీ హామీలు ఇవ్వొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
  • కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని కలిపి ఏడాది0కు 25వేలకు పైగా ఇస్తోంది.
  • కేంద్రం నుంచి తెలంగాణలో 39లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
  • న్యాయపరంగా కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధుల కంటే ఎక్కువగానే తెలంగాణకు ఇచ్చింది.
  • మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీష్ రావు శుద్ధ అబద్ధం చెప్పారు.
  • అబద్ధాలతో హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.
  • మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినట్లు హరీష్ రావు ఆధారాలు చూపించాలి.
  • మీటర్లు పెట్టమని కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
  • కేంద్రం తెలంగాణకు లక్షల కోట్లు ఇస్తున్నా గత ప్రభుత్వం కావాలని తప్పుడు ప్రచారం చేసింది.
  • వచ్చే ఆదాయంలో 30శాతం మాత్రమే ప్రజలకు చేరుతోంది.
  • 30శాతం నిధులతో అమలు కానీ హామీలు ఎలా ఇచ్చారు?
  • కాంగ్రెస్ హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు.
  • కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇచ్చారు.
  • కాంగ్రెస్‌కు వంద రోజుల సమయం ఇస్తాం.
  • హామీలు అమలు కాకపోతే ప్రజా పోరాటం చేస్తాం.


కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ కామెంట్స్‌

  • పదేళ్లలో తెలంగాణను అప్పులమయం చేశారు. 
  • గత ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రం అని చెప్పారు. 
  • కానీ, అది నిజం కాదు. 
  • పేదల కోసం ఆరు గ్యారంటీలు తీసుకొచ్చాం. 
  • గ్రామాల్లో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారు
  • అసలు రెవెన్యూ వ్యవస్థ గ్రామాల్లో లేదు
  • ఎక్కడ తెలంగాణ నంబర్‌ వన్‌ అయ్యింది.
  • రాష్ట్రంలో 75లక్షల కుటుంబాలు బీపీఎల్‌ కింద ఉన్నాయి. 
  • అన్నా రాష్ట్రాల మాదిరిగానే ఐటీ అభివృద్ధి ఇక్కడ కూడా జరిగింది.  
  • బీఆర్‌ఎస్‌ చెప్పుకోవడమే తప్ప మంచి చేసిందేమీ లేదు.

అంత ఆవేశం ఎందుకు: భట్టి 

  • రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు లేదు.
  • హరీష్ రావు తన పేరు తీసుకున్నారు కాబట్టే ఆయన స్పందించారు.
  • మేము పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం.
  • రెండు రోజులు కాలేదు అప్పుడే అవేశం ఎందుకు


కడియం శ్రీహరి కామెంట్స్‌..

  • డిప్యూటీ సీఎం భట్టి స్పీకర్ చైర్‌ను డిక్టెట్ చేస్తున్నారు.
  • శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. హరీష్ రావుకు సమయం ఇచ్చారు.
  • శ్రీధర్ బాబు చెప్పిన దానికి లేచి హరీష్ రావుకు మైక్ ఇవ్వొద్దు అంటే అర్థం ఏంటి?

హరీష్‌రావుపై ఫైర్‌

  • అసెంబ్లీలో హరీష్ రావుపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు ఆగ్రహం
  • కొత్త సభ్యులు మాట్లాడుతుంటే అడ్డుకోవడం హరీష్ రావుకు కరెక్ట్ కాదు.
  • పది నిమిషాలు ఓపిక పట్టలేని వాళ్లు పదేళ్లు ఎలా రూల్ చేశారు.

హరీష్ రావు కామెంట్స్‌..

  • నేను ఇవ్వాళ సభలో రాజగోపాల్ రెడ్డి పేరును తీసుకోలేదు.
  • నా పేరు తీసుకోని నా మీద కామెంట్స్ చేశారు.
  • నేనేమీ రూ.50 కోట్లు ఇచ్చి పీసీపీ పదవి తీసుకోలేదు.


హరీష్ రావు కామెంట్స్‌పై శ్రీధర్ బాబు సీరియస్.

  • హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
  • హరీష్ రావు తన మాటలను వెనక్కి తీసుకోవాలి.
  • హరీష్ రావు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే సభ నుంచి బహిష్కరిస్తాము.

రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేను వెనక్కి తీసుకుంటా-హరీష్ రావు
నేను కొత్తగా చేసిన కామెంట్స్ కాదు కోమటి రెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలే ఇవి -హరీష్ రావు
రాజగోపాల్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకుంటే నేను తీసుకుంటా.
మా నాయకుడిపై కామెంట్స్ చేస్తే మేము సమాధానం చెప్పకూడదా? హరీష్ రావు

మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. 

  • మా పార్టీ అంతర్గత విషయాల్లో మీరెందుకు కలుగజేసుకుంటారు.
  • పదేళ్లు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలి.
  • మేము మా సీఎం నాయకత్వంలో పనిచేస్తాం.

స్పీకర్‌ సీరియస్‌

  • హరీష్ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కామెంట్స్
  • హరీష్ రావు సీనియర్ సభ్యులు.
  • కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులను పోడియం ముందుకు పంపడం కరెక్ట్ కాదు.
  • ఇలాంటి ఘటనలు మళ్ళీ పునవృతం కాకూడదు. 

సభలో గందరగోళం

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ల ఆందోళన
  • హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియం ముందు నిరసన

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం

  • కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు అయింది
  • శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు
  • సభలో BRS ఎమ్మెల్యేల తీరుపై శ్రీధర్ బాబు ఆగ్రహం.
  • స్పీకర్ పోడియం ముందుకు వచ్చి స్పీకర్ చైర్‌ను బెదిరించడం సరికాదు
  • BRS ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్‌ను అవమానిస్తున్నారు.
  • కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేల పద్ధతి కాదు.

రాజగోపాల్ రెడ్డి కామెంట్స్‌..

  • హరీష్ రావుకు గంట సమయం ఇచ్చినా సమయం సరిపోలేదు అంటున్నారు.
  • అబద్ధాలను నిజం అని చెప్పడంలో హరీష్ రావుకు మేనమామ పోలికలు వచ్చాయి.
  • హరీష్ రావు ఎన్ని ఎండ్లు కష్టపడ్డా కేసీఆర్ తరువాత, కేటీఆర్ సీఎం అవుతాడు కానీ హరీష్ రావు కాలేడు.
  • తండ్రి కొడుకులు వాడుకోవాల్సినంత వాడుకొని వదిలేస్తారు.
  • నాకు మంత్రి పదవి రాదు అని హరీష్ రావు అన్నారు.
  • నా మంత్రి పదవిపై నిర్ణయం మా సీఎం, అధిష్టానం తీసుకుంటుంది.


అసెంబ్లీలో హరీష్ రావు కామెంట్స్‌..

  • సభను నేను తప్పుదోవ పట్టించలేదు.
  • సీఎం రేవంత్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. 
  • అంతా అర్థం కలవాలంటే కొంత టైం పడుతుంది. 
  • కాళేశ్వరంపై తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాత్రమే తీసుకోలేదు. 
  • పాలమూరు రంగారెడ్డితో పలు ప్రాజెక్టులకు ఉపయోగించారు. 
  • రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు. 
  • ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. 
  • మీ తెలివి తేటలతో నిధులు తీసుకురండి. 
  • గత ప్రభుత్వాన్ని బాద్నాం చేయకండి. 
  • మా పై నెపం నెట్టి తప్పించుకోకండి. 
  • మాపై కోపంతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయకండి

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌ 

  • శ్వేతపత్రం పేజీ నెంబర్‌ 21 చూసుకోవాలి 
  • కాళేశ్వరం కోసమే 80 వేల కోట్ల రుణం తీసుకున్నారు
  • ఇవి కాకుండా ఖర్చు ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టింది 
  • కాళేశ్వరం అద్భుతం అని హరీశ్‌రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారు
  • హరీశ్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలు 
  • కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చూపించారు 
  • ఇలా చెప్పే అప్పులు తీసుకువచ్చారు 
  • మిషన్‌ భగీరథ తర్వాతనే నీళ్లు తాగామా 
  • 2014కు ముందు ఎవరూ నీళ్లు తాగలేదా 
  • మిషన్‌ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించారు
  • ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారు 

కాళేశ్వరంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు రెడీ : హరీశ్‌రావు 

  • మేడిగడ్డపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం 
  • మా లీడర్‌ కేసీఆర్‌ తన కోసం ఏదీ కట్టుకోలేదు 
  • అన్నీ ప్రజల కోసమే కట్టారు 

ప్రగతిభవన్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు 

  • ప్రగతిభవన్‌లో ఏముందో భట్టి విక్రమార్క ఇప్పుడు చెప్పాలి 
  • ఎన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌ గదులున్నాయి 
  • ఎన్ని స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయి 
  • భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్‌ 

హరీశ్‌రావు ప్రసంగంపై మంత్రుల మండిపాటు 

  • హరీశ్‌రావు శ్వేతపత్రం మాట్లాడుతుండగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌, పొన్నం, జూపల్లి అభ్యంతరం
  • హరీశ్‌రావు కేంద్రంపై మళ్లీ అవే అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఉత్తమ్‌ 
  • తమకూ బడ్జెట్‌పై అవగాహన  ఉందన్న పొన్నం 
  • హరీశ్‌రావు కార్పొరేషన్‌ రుణాలపై అబద్ధాలు చెప్పారన్న జూపల్లి 
  • అన్నీ కూలగొట్టి మళ్లీ కట్టి నిధులన్నీ వృథా చేశారని ఆరోపించిన కొండా సురేఖ 
  • సెక్రటేరియల్‌ కూల్చి మళ్లీ ఎందుకు కట్టారని ప్రశ్న 
  • డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు మాత్రం కట్టలేదని విమర్శించిన సురేఖ 

శ్వేతపత్రంపై హరీశ్‌రావు ఫైర్‌ 

  • ముఖ్యమంత్రి గారి పాత గురువు శిష్యులు శ్వేతపత్రం వండి వార్చారు
  • తయారు చేసిన వాళ్లలో ఏపీ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఉన్నారు
  • శ్వేతపత్రంలోని వివరాలు శుద్ధతప్పు
  • అప్పులను రెవెన్యూతో పోల్చారు 
  • అప్పులను జీఎస్డీపీతో పోల్చలేదు 
  • కరోనా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు
  • తెలంగాణ సొంత ఆదాయం ఎలా పెరిగిందన్నది చూపలేదు
  • ఆరోగ్యంపై తక్కువగా ఖర్చు పెట్టామనేది అవాస్తవం
  • కరోనా వల్ల కేంద్రం ఎక్కువగా అప్పులు తీసుకునేలా చేసింది
  • కరోనా, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పడింది 
  • అయినా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు
  • కేంద్రంతో మా ఎంపీలు పోరాడారు 
  • కాంగ్రెస్‌ నాయకులు ఈ విషయంలో కేంద్రాన్ని ఎప్పుడూ అడగలేదు
  • కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది
  • పన్నుల్లో వాటా సెస్‌ల రూపంలో ఎగ్గొట్టారు 
  • ఏపీ విద్యుత్‌ బకాయిలు కేంద్రం వల్లే రాలేదు 
  • సీఎస్‌ఎస్‌లో కేంద్రం వల్లే నష్టపోయాం 
  • లక్షకోట్ల కేంద్రం నుంచి రాకపోవడం వల్లే ఇబ్బంది కలిగింది 
  • ఇవి వస్తే ఇంకో లక్ష కోట్ల అప్పు తగ్గేది 
  • సంబంధం లేని రుణాలన్నీ చూపి 6 లక్షల కోట్ల అప్పులు తేల్చారు
  • అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనేది పూర్తి అబద్ధం
  • కాంగ్రెస్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి 
  • లేదంటే పెట్టుబుడు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావు 
  • అధికారంలోకి వచ్చి కూడా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు 

టీ బ్రేక్‌ తర్వాత ప్రారంభమైన అసెంబ్లీ

  • ఆర్థిక స్థితిపై రిలీజ్‌ చేసిన వైట్‌పేపర్‌ మీద చర్చ

అసెంబ్లీ అరగంట పాటు వాయిదా

  • ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి స్వల్పకాలిక చర్చ ప్రారంభించిన డిప్యూటీ సీఎం
  • అరగంట ముందు 42 పేజీల బుక్‌ ఇచ్చి మాట్లాడమంటే ఎలా అన్న హరీశ్‌రావు, అక్బరుద్దీన్‌ ఒవైసీ 
  • గతంలో కూడా ఈ సంప్రదాయం ఉందన్న లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ మంత్రిశ్రీధర్‌బాబు
  • దీంతో అరగంట పాటు సభను వాయిదా వేసి టీ బ్రేక్‌ ఇచ్చిన స్పీకర్‌ 

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్‌ చేసిన డిప్యూటీ సీఎం భట్టి 

  •  ఎన్నో ఆశలతో తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం
  •  కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి.
  •  కనీసం రోజువారి ఖర్చులు కూడా లేని పరిస్థితి
  •  తెలంగాణ ప్రజల ఆశలు, కోరికలు, కళలు నెరవేర్చాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది
  •  పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నాం.
  •  ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నాం
  •  నేను విడుదల చేసే శ్వేతపత్రం పై ప్రతీ సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నాను

👉: కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం.. క్లిక్‌ చేయండి

తెలంగాణ శాసనసభ సమావేశం ప్రారంభం 

  • CPI ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశవరావు పేరును ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
  • MIM ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ పేరు ప్రకటన


శాసనసభలో బీఆర్‌ఎస్‌ సమావేశం

  • శాసనసభలో సమావేశమైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చ

అప్పులు కాదు ఆస్తులు పెంచాం: బీఆర్ఎస్

  • పదేళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెంచామని చెప్తున్న గులాబీ పార్టీ
  • 51 పేజీల ఆస్తుల వివరాలను విడుదల
  • 33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు.
  • ఇప్పటికే 25 కలక్టర్ భవనాలు ప్రారంభం
  • 2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు
  • రాష్ట్రంలో  ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు
  • 8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం
  • కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు
  • 1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు
  • 7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్,  
  • 23,37 654 మంది విద్యార్థులకు లబ్ధి
  •  కేజి టూ పీజీ గంబిరావు పేట లో తొలి క్యాంపస్
  • 70 గదుల నిర్మాణం 
  • 250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రం
  • 1000 మంది కూర్చునేల డైనింగ్ హాల్
  • 22.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
  • 334 చిన్న పరిశ్రమల పురుద్దరణ
  • 10,40p ఎకరాల్లో అతిపెద్ద పార్మ క్లస్టర్
  • 81.81 చ.కి.మి పెరిగిన పచ్చదనం, హరిత హరం 
  • Hmda పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లకులు
  • 19472 పల్లె ప్రకృతి వనాలు, 13657ఎకరాల విస్తీర్ణం
  • 109 అర్బన్ ఫారెస్ట్ 75 740 ఎకరాల విస్తీర్ణం
  • 1,00,691 కిమి రహదారి వనాలు
  • 10,886 కిమీ కందకల తవ్వకం
  • 19వేళ పల్లెల్లో పార్కులు
  • 2700 ట్రీ పార్కులు
  • 1200 కోట్ల తో యాదాద్రి పునర్నిర్మాణం
  • 2800 కోట్ల ఆలయాల అభివృద్ధి
  • 100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు
  • 75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం 
  • 212 కోట్ల తో బ్రహ్మణ సంక్షేమం కోసం

ఆరోగ్య శాఖ లో

  • 34000 హాస్పిటల్ బెడ్స్
  • 34000 ఆక్సిజన్ బెడ్స్,
  • 80 ఐ సీ యు కేంద్రాలు
  • 56బ్లడ్ బ్యాంక్ లు
  • 82 డయాలసిస్ కేంద్రాలు
  • 500 బస్తీ దవాఖానాలు
  • 1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్ 
  • 1571 కోట్ల తో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ
  • 3779 కోట్ల తో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
  • 33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు

     
  • 585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 
  • 137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు 
  • 10.13 లక్షల సీసీ కెమెరాలు
  • 20,115 పోలీసు వాహనాలు
  • 9 కమీషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు
     
  • కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం
  • విద్యుత్ రంగం  2014లో  7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్ల కు పెంపు
  • 15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం
  • వ్యవసాయానికి , గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం 
  • 57.82 శాతం  తలసరి విద్యుత్ వినియోగం లో వృద్ది
  • లోడ్ మెయింటేన్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు
  • 2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు
  • 2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు 
  • 2023 లో 1,37, 571 కోట్ల పెరిగిన విద్యుత్ ఆస్తులు
  • 59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల

     
  • ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ 10 ఏళ్లలో 70, 965.75 కోట్ల తో నిధులు ఖర్చు
  • దళిత బంధు పథకం అమలు
  • 5000 కోట్లతో గొర్రెల పంపిణీ 
  • 72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల
  • 5402 కోట్ల రైతు బీమా 
  • 572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు
  • 1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం
  • గ్రామాల్లో 100 శాతం మంచి నీటి సౌకర్యం, స్కూళ్ళు, అంగన్వాడీ లు, ప్రభుత్వ సంస్థల్లో నీటి సౌకర్యం
  • 8735.32 కోట్ల తో మిషన్ కాకతీయ, 21, 633 చెరువుల పునరుద్దరణ
  • 617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం
  • 146.50కోట్ల తో 125  అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం
  • 178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి
  • 2014 లో 27, 200 కోట్ల సేల్స్ టాక్స్ 2023 లో 72564 కోట్ల వసూళ్లు
  • 2014 లో 2832 కోట్ల  రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం 14, 291 కోట్ల వసూలు
  • 2014 లో 1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023 లో  3.12,398 కోట్ల పెరిగిన తలసరి ఆదాయం
  • 159.6 పెరిగిన తలసరి ఆధాయం
  •  పెరిగిన రూపాయి అప్పులు 1000 రూపాయల ఆస్తి పెంచాం
  • ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కొంతమంది చూస్తున్నారు 
  • తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన బీఆర్ఎస్

సభలో వార్‌ తప్పదా?  బీఆర్‌ఎస్‌ ముందుగానే..

  • తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ డాక్యుమెంటరీ విడుదల
  • ప్రభుత్వ శ్వేత పత్రం కంటే ముందే విడుదల చేసిన ప్రతిపక్ష పార్టీ
  • పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బీఆర్‌ఎస్‌
  • శాఖల వారీగా అభివృద్ధి, ఆస్తులు, ఆదాయం ప్రకటించిన బీఆర్‌ఎస్‌
  • 2014 నుంచి 2023 బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిపై శాఖల వారీగా లెక్కలు

అప్పులా? ఆస్తులా?

  • తెలంగాణ ఆర్థికపరిస్థితిపై కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌
  • పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ లేదంటున్న అసెంబ్లీ వర్గాలు
  • కాంగ్రెస్‌ ప్రజంటేషన్‌ఇస్తే.. తమకూ అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్‌ఎస్‌
  • సభలో నివేదిక ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క
  • కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ నుంచి కౌంటర్‌ ఇవ్వనున్న హరీష్‌రావు?
  • సభలో సమరానికి ముందే పార్టీల ఫైటింగ్‌
  • అప్పులే మిగిలాయని కాంగ్రెస్‌.. ఆస్తులు సృష్టించామంటున్న బీఆర్‌ఎస్‌
  • సోషల్‌ మీడియాలోనూ పొలిటికల్‌ రచ్చ


తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక ఘట్టం

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్‌ సర్కార్‌ శ్వేత పత్రం
  • అప్పులు, నీటి పారుదల, విద్యుత్‌ పరిస్థితులపై వివరణ
  • 2014 నుంచి ఆదాయ-వ్యయాలు అప్పుల ప్రస్తావన
  • పాయింట్‌ టు పాయింట్‌.. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్న సర్కార్‌
  • సీఎం రేవంత్‌తో పాటు భట్టి, ఉత్తమ్‌ ప్రసంగించే ఛాన్స్‌
  • ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అయిన బీఆర్‌ఎస్‌
  • వాడీవేడిగా చర్చ నడిచే అవకాశం

హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్న సీఎం
  • తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం రేవంత్


ఖర్గే కొడుక్కి కేటీఆర్‌ కౌంటర్‌

  • శాసనసభ సమావేశం కంటే ముందే పొలిటికల్‌ హీట్‌
  • నిన్నటి నుంచి కర్ణాటక నేతలతో కేటీఆర్‌ ట్విటర్‌ వార్‌
  • సీఎం సిద్ధరామయ్యతో నిన్నంతా జరిగిన విమర్శలు-ప్రతివిమర్శల పర్వం
  • ఇవాళ కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గేను ఉద్దేశించి ట్విట్టర్ లో కేటీఆర్

  • హాయ్ ప్రియాంక్ జీ
  • మీరు కూడా ఇష్యూలో చేరాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం.
  • 2 లక్షల మంది కర్ణాటక యువతకు ఉపాధి గురించి మీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనలు , ఖజానా ఖాళీ పై డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనలు కూడా నకిలీవా?

 మేము కాంగ్రెస్ పార్టీని కాదు, వారి ముగ్గురు ఎంపీలతో సహా తెలంగాణలోని బిజెపి పెద్దలందరినీ ఓడించాము. సునీల్,టీమ్  ప్రచారానికి మీరు దూరంగా ఉండటానికి  జాగ్రత్తగా,సిద్ధంగా ఉండటం మంచిది

నేడు, రేపు శాసనసభ సమావేశాలు

  • నేడు, రేపు శాసన సభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
  • ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులుపై స్వల్ప కాలిక చర్చ
  • రేపు విద్యుత్‌ రంగంపై చర్చ
  • పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు రెడీ అయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
  • కౌంటర్‌కు సిద్ధమైన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌
  • గత సమావేశంలో విమర్శలు-ప్రతివిమర్శలతో హీటెక్కిన సభ
  • ఇవాళ మళ్లీ అదీ రిపీట్‌ అయ్యే ఛాన్స్‌!


ట్విటర్‌ వేదికగా తెలంగాణ సర్కార్‌కు కేటీఆర్‌ చురకలు

  • గ్యారెంటీలను గాలికొదిలేసి… శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు..
  • ప్రచారంలో హామీలను ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..?
  • కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?.. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా..?
  • గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నరా..?
  • శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసం..?
  • అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి తొండి వేషాలా..?
  • తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం
  • శాసనసభకు  సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా..!
  • దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక... ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం
  • ఆడిట్ రిపోర్ట్‌ లు..ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు  లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా..!
  • ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి..ప్రజల ముందువుంచాం..!
  • మేం దాచింది ఏమీలేదు.. మీరు శోధించి..సాధించేది ఏమీ వుండదు..!
  • కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరు..!
  • మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి...తప్పించుకోవాలని చూస్తారా...?
  • అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు
  • నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..! చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం మీకు అలవాటే..!
  • అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ ..!
  • అంచనాలు..అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా..?
  • వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలు..!
  • మీరు ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటాం..!
  • ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదు.. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని..?
  • కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయం..
  • హామీలు అమలు చేయలేకపోతే.. అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ..!!  జై తెలంగాణ


 

స్పీకర్‌కు మాజీ మంత్రి హరీష్‌ లేఖ

  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌ రావు లేఖ 
  • శాసన సభ సమావేశాల్లో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన హరీష్‌ 
  • ఆర్థిక‌, సాగునీటి , విద్యుత్ అంశాల‌పై తెలంగాణ ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌
  • ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదనా వినిపించేందుకు అనుమతించాలని కోరిన హరీష్‌
  • తాము కూడా ఎక్క‌డెక్క‌డ ఖ‌ర్చు చేశామ‌నేది కూడా చెప్పేందుకు సిద్దంగా ఉన్నామ‌న్న మాజీ మంత్రి
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు


     

  • శాసన సభ సమావేశాల్లో నేటి కార్యక్రమాలు
  • దివంగత మాజీ శాసన సభ్యులు రామన్న గారి శ్రీనివాస్ రెడ్డి ,కొప్పుల హరీశ్వర్ రెడ్డి ,కుంజా సత్యవతిలకు సభ సంతాపం
  • తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై లఘు చర్చ చేపట్టనున్న సభ్యులు
  • తెలంగాణ ఆర్దిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నేడు తెలంగాణ శాసన సభ సమావేశాలు

  • తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభకు ఇది తొలి సెషన్‌
  • ఇప్పటికే నాలుగురోజులపాటు సమావేశాల నిర్వహణ.. నేడు ఐదవ రోజు
  • నేడు, రేపు సమావేశాలు నిర్వహణ
  • ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ
  • మరోవైపు నిరవధికంగా వాయిదా పడ్డ శాసన మండలి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement