నన్ను తిట్టే పనిని కాంగ్రెస్‌ ఔట్‌సోర్స్‌కిచ్చింది: మోదీ | Gujarat Polls PM Modi Criticizes Congress And Aam Aadmi Party | Sakshi
Sakshi News home page

నన్ను తిట్టే పనిని కాంగ్రెస్‌ ఔట్‌సోర్స్‌కిచ్చింది: మోదీ

Published Wed, Oct 12 2022 7:45 AM | Last Updated on Wed, Oct 12 2022 7:45 AM

Gujarat Polls PM Modi Criticizes Congress And Aam Aadmi Party - Sakshi

జమ్కాన్‌డోర్నా: కాంగ్రెస్‌ పార్టీ తనను తిట్టే బాధ్యతను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించిందంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. గుజరాత్‌ గ్రామాల్లో నిశ్శబ్దంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని బీజేపీ శ్రేణులను హెచ్చరించారు. ప్రధాని మంగళవారం రాజ్‌కోట్‌ జిల్లా జమ్కాన్‌డోర్నా పట్టణంలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష పార్టీ నిశ్శబ్ద వ్యూహంపై మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. దీని వెనుక ఢిల్లీ నుంచి గుజరాత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారు ఉన్నారని నాకు తెలుసు. ఒక గ్రూపు మొత్తం మనకు వ్యతిరేకంగా గోల చేస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తమిళనాట శశికళకు మరో ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement