April 3rd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024: Political News Round Up On April 3rd In Telugu | Sakshi
Sakshi News home page

AP Elections Updates April 3rd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌, ఎప్పటికప్పటి సమాచారం..

Published Wed, Apr 3 2024 7:29 AM | Last Updated on Wed, Apr 3 2024 7:29 AM

AP Elections 2024: Political News Round Up On April 3rd In Telugu

AP Political News And Election News April 3rd Telugu Updates

7:15 AM, April 3rd 2024
చంద్రబాబు డ్రామాలపై సీఎం జగన్‌ సీరియస్‌

  • చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలి. 
  • 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
  • కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు. 
  • లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్‌ వచ్చేది. 
  • పెన్షన్లు ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్‌ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదే­శాలిప్పించాడు.
  • చంద్రబాబు ఏ స్థాయికి దిగజారి­పోయాడో ఆలోచించండి.

 

 

 

7:05 AM, April 3rd 2024
టీడీపీ రెడీ చేసిన చీరలు స్వాధీనం..

  • పామర్రు (మ) పెరిశేపల్లిలో  ఓ ఇంట్లో భారీ మొత్తంలో చీరలు స్వాధీనం
  • ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చీరలను సిద్ధం చేసిన టీడీపీ
  • రమణ అనే వ్యక్తి ఇంట్లో చీరల బస్తాలను గుర్తించిన పోలీసులు
  • పక్కా సమాచారంతో ఎస్.ఎస్.టీమ్ తో కలిసి తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • సుమారు 10 లక్షల విలువైన చీరలు స్వాధీనం
  • డీఎస్పీ శ్రీకాంత్ కామెంట్స్
  • ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో గిప్ట్ లు తెచ్చినట్లు సమాచారం వచ్చింది
  • మాకు అందిన సమాచారం మేరకు ఎస్ ఎస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించాం
  • మావద్ద ఉన్న ఆధారాలతో రమణ, గణేష్ అనే వ్యక్తులను విచారించాం
  • ఎలక్షన్లలో పంపిణీ చేసేందుకు టీడీపీ పార్టీ వారు తెప్పించినట్లు నిర్ధారణ అయ్యింది
  • సుమారు 10 లక్షల విలువ ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నాం
  • విజయవాడలో బుక్ చేసి పంపిణీ కోసం పామర్రు తెచ్చినట్లు గుర్తించాం

 

6:50 AM, April 3rd 2024
వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి

  • బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్
  • వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం
  • గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు
  • పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్
  • టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్
  • టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్‌కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు
  • అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్  ఎందుకు మార్చరని డిమాండ్

 

6:40 AM, April 3rd 2024
అవనిగడ్డ జనసేనలో కుంపట్లు 

  • అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు 
  • జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్‌కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు 
  • ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం 
  • చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ 
  • డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్‌కి సీట్ ఇస్తారా? 
  • జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు

 

6:30 AM, April 3rd 2024
వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున

  • పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు
  • పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు
  • బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు
  • ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు
  • టిప్పర్ డ్రైవర్‌లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు
  • చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష?
  • ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు
  • చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు
  • పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం
  • కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు
  • కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు
  • అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి?
  • ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు?
  • చంద్రబాబు బతుకు చెడ
  • జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి
  • పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement