May 6th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Assembly Elections 2024: Political News Updates In Telugu On May 6th, 2024 | Sakshi
Sakshi News home page

May 6th AP Election News Updates: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

May 6 2024 7:21 AM | Updated on May 6 2024 5:39 PM

AP Elections 2024: Political News In Telugu On May 06 Updates

May 6th AP Elections 2024 News Political Updates..

3:49 PM, May 6th, 2024

తాడేపల్లి :

మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చడంపైనే ఉంటుంది: సీఎం వైఎస్ జగన్

  • కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుందంటే అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు
  • అధికారం దక్కాక అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది
  • వచ్చే ఎన్నికల్లో మన YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.  

    మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చడంపైనే ఉంటుంది. కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుందంటే అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు.. అధికారం దక్కాక అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి,… pic.twitter.com/ArWMGPvlYg

    — YS Jagan Mohan Reddy (@ysjagan) May 6, 2024

 

 

   -

2:30 PM, May 6th, 2024

భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..

  • భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!
  • జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.
  • ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడ
  • సర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.
  • చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులు
  • ఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!


     

2:10 PM, May 6th, 2024
ఓటర్లను ప్రలోభలకు గురిచేస్తు​న్న చంద్రబాబు..

  • కర్నూలు..
  • కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ప్రజాగళం సభ.
  • చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన మద్యం.
  • మంచి మద్యం అందిస్తామని చంద్రబాబు ఓట్లను ప్రభావితం చేస్తున్నాడు.
  • చంద్రబాబు వస్తే మంచి మద్యం, మంచిగా తాగి ప్రాణాలను తీసుకొండి అని సూచి​స్తున్నాడు.
  • ప్రజలకు మంచి పథకాలు ఇస్తామని చెప్పాల్సిన బాబు మందు బాబులను మద్యం అందిస్తున్నాడు.
  • ఏపీలోని మద్యాంధ్రగా తయారు చేస్తామని బాబు ప్రచారం చేయడం అందరికీ వింతగా అనిపించింది.
  • మద్యం కావాలంటే బాబు రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
  • బహిరంగ సభలో మద్యం సీసాతో హల్ చల్ చేసిన టీడీపీ కార్యకర్తలు. 

 

1:45 PM, May 6th, 2024
బాలకృష్ణకు కురుబ దీపికా కౌంటర్‌

  • హిందూపూర్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  అభ్యర్థి  కురుబ  దీపికా  కామెంట్స్..
  • సినిమాల్లో నటించే బాలకృష్ణను  హిందూపూర్ ప్రజలు ఈసారి పూర్తిగా సినిమాలకే పరిమితం చేసే తీర్పు ఇస్తారు.
  • హిందూపూర్‌ ప్రజలు ఎమ్మెల్యేగా  బాలకృష్ణను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో లేకుండా  పోయాడు.
  • నాకు అవకాశం  ఇస్తే  ఎప్పుడు లోకల్‌గా హిందూపూర్ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాను.
  • సీఎం జగన్  హిందూపూర్  సభతో  ఇప్పటికే విక్టరీ వచ్చినట్టు అయ్యింది. 
    ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.


1:20 PM, May 6th, 2024
ఉమాకు వైఎస్సార్‌సీపీ నేత కౌంటర్‌

  • విజయవాడ
  • బోండా ఉమాపై ఘటు విమర్శలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత మోదుగుల గణేష్
  • విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ  నేతలు దాడి చేశారు.
  • టీడీపీ నాయకులు మద్యం తాగిన మైకంలో వాణి అనే మహిళపై అసభ్యంగా మాట్లాడారు.
  • ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి చేశారు.
  • బోండా ఉమా నిజాలు తీసుకొని మాట్లాడాలి.
  • దళితులపై మీ కపట ప్రేమ అందరికీ తెలుసు.
  • బోండా ఉమా భూకబ్జాలు చేశావ్‌ కాబట్టి నీపైన రౌడీషీటర్ కేసు పెట్టాలి. 

 

1:00 PM, May 6th, 2024
రేపల్లెలో సీఎం జగన్‌ కామెంట్స్‌.. 
 

  • రాష్ట్రమనే పొలంలో మీ బిడ్డ చేసిన విప్లవ సాగుతో ఎన్నో సత్ఫలితాలు..
  • రాష్ట్రమనే పొలంలో ఈ ఐదేళ్లలో సంస్కరణలనే విత్తనాలు వేశాం..
  • 15 ఏళ్లలో ఈ విత్తనాలన్నీ మహావృక్షాలవుతాయి.. ప్రజల జీవితాల్ని మారుస్తాయి
  • చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క స్కీమ్ గుర్తుకొస్తుందా?  
  • ప్రత్యేకహోదాను కూడా చంద్రబాబు అమ్మేశాడు..
  • మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..
  • సాధ్యంకాని హామీలతో చంద్రబాబు తన మేనిఫెస్టో ఇచ్చారు..
  • చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే..
  • చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది..
  • జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు
  • ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ..
  • బాబుకు అధికారం వచ్చేదాకా అబద్ధాలు.. వచ్చిన తర్వాత మోసాలు, మాయలు
  • మంచి చేసే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, చెడు చేసే సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి..

 

12:30 PM, May 6th, 2024
చంద్రబాబుది లాక్కునే వ్యక్తిత్వం: కొండా రాజీవ్‌ గాంధీ

  • వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కామెంట్స్..
  • జగన్ అందరికీ అన్ని ఇవ్వాలనుకునే మనిషి.. చంద్రబాబు లాక్కునే మనిషి
  • ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నాడు
  • చిన్నతనంలోనే రైల్వే స్టేషన్‌లో చోరీలు చేసిన వ్యక్తి
  • అలాంటి వ్యక్తి ల్యాండ్ టైటిలింగ్‌ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • ఈ చట్టం ఎంతో గొప్పదని అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ ప్రకటించారు
  • బయటకు వచ్చాక నాలుక మడతేస్తున్నారు
  • ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వైరల్‌ కాల్స్ చేస్తున్నారు
  • కేంద్రంలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు మోదీతో ఈ చట్టంపై మాట్లాడించాలి
  • ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్, ముస్లింల రిజర్వేషన్ల గురించి చంద్రబాబు, పవన్ కేంద్ర పెద్దలతో మాట్లాడించాలి
  • ఆ చట్టం గురించి రామోజీరావు సైతం తన ఛానల్‌లో గొప్పగా చూపించారు
  • కానీ జనాన్ని మోసం చేయటానికి ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
  • వీటిని నమ్మే పరిస్థితిలో జనం లేరు
  • చిరంజీవిని దారుణంగా అయ్యన్నపాత్రుడు కొడుకు, బాలకృష్ణ తిట్టారు
  • సిగ్గు, పౌరుషం ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితోనే తిరుగుతున్నారు
  • పవన్ ఎప్పటికీ ప్యాకేజీ స్టారేనని మళ్ళీ రుజువు చేసుకున్నారు

 

11:50 AM, May 6th, 2024
ఏపీలో బీజేపీ ఎక్కడుంది: వంగవీటి నరేంద్ర

  • తూర్పుగోదావరి..
  • వైఎస్సార్‌సీపీ నేత వంగవీటి నరేంద్ర కామెంట్స్..
  • ఏపీలో బీజేపీ లేదు. 
  • టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫొటోలు లేవు.
  • ప్రధాని మోదీ గ్యారెంటీ టీడీపీ, జననేన మేనిఫెస్టోతో సంబంధం లేదు. 
  • జనసేన కాపుల పార్టీ కాదు.
  • వైఎస్సార్‌సీపీ కాపులకు 34 ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లు కేటాయించింది. 
  • ఎన్డీయే కూటమి కేవలం నాలుగు సీట్లు కాపులకు ఇచ్చారు.
  • వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో ఉండడానికి సిగ్గుండాలి
  • రంగాని చంపిన టీడీపీలో ఆయన కొనసాగడం ఎంతవరకు సమంజసం
  • రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీదే మళ్లీ విజయం
  • జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావటం ఖాయం

 

11:20 AM, May 6th, 2024
చంద్రబాబు, లోకేష్ చిప్పకూడు తింటారు: వెల్లంపల్లి

  • ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్
  • చంద్రబాబు దుర్మార్గం పరాకాష్టకు చేరుకుంది.
  • అవ్వ తాతల పెన్షన్ విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించాడు.
  • చంద్రబాబును కుప్పంలో కూడా ప్రజలు ఓడిస్తారు.
  • చంద్రబాబు, లోకేష్ చిప్పకూడు తింటారు
  • చంద్రబాబు అండ్ కో టీం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు.
  • చంద్రబాబుకు కావలసింది అమరావతి తమ సామాజిక వర్గం బాగుండటమే.
  • సీఎం జగన్ కోవిడ్ సమయంలో కూడా ఏ పథకాన్ని ఆపలేదు.
  • హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు.
  • సీఎం జగన్‌పై ఆరోపణ చేసే అర్హత చంద్రబాబుకు లేదు.
  • స్వతంత్ర సమరయోధుల భూమి లాక్కుంది సెంట్రల్ బోండా ఉమ.
  • క్యాన్సర్ బారినపడ్డ చిన్నపిల్ల భూకబ్జా చేద్దామని ప్రయత్నించింది బోండా ఉమా కాదా.?
  • సెంట్రల్‌లో బోండా ఉమా మద్యం సేవించి ప్రచారానికి వస్తున్నాడు.

 

11:00 AM, May 6th, 2024
నిన్న విరవ గ్రామంలో జరిగిన ఘటనపై స్పందించిన వంగా గీత

  • వంగా గీతా కామెంట్స్‌..
  • టీడీపీ, జనసేన నేతల్లో ఓటమి భయం పట్టుకుంది.
  • అందుకే ఊరూరా ప్రచారానికి అడ్డుతగులుతున్నారు.
  • అయినా మేము సంయమనంతో ఉంటున్నాం.
  • హత్య రాజకీయాలు చేస్తోంది మేము కాదు.
  • అలాంటి అలవాటు ఉన్నది టీడీపీ, జనసేనకు మాత్రమే.
  • చిన్న పిల్లల్ని ప్రచారానికి వాడకూడదు అని ఎన్నికల సంఘం చెప్తోంది.
  • కలెక్టర్, రిటర్నింగ్ అధికారులు వీడియోను తెప్పించుకొని వారిపై చర్యలు తీసుకోవాలి.
  • ప్రచారానికి ఇంత మంది ఉండాలని ఈసీ చెప్తోంది.
  • అంత మంది ఎందుకు టీడీపీ, జనసేనా ప్రచారంలో ఉన్నారు. వారికి అనుమతి ఉందా?.
  • నేను గెలుస్తున్నాననే ఇలాంటి రెచ్చగొట్టే, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.

 

10: 30 AM, May 6th, 2024
పవన్‌పై ముద్రగడ ఫైర్‌..

  • పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు

  • నేను ఏనాడూ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడలేదు. 

  • ఇంట్లో ఉన్న నన్ను పవన్‌ రోడ్డు మీదకు లాగాడు. 

  • హైదరాబాద్‌ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. 

  • ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. 

  • మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.

  • మీ కుటుంబంలో డ్రగ్స్‌ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. 

  • ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. 

  • పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు.

  • పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. 

  • నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. 

  • వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను.

 

10:00 AM, May 6th, 2024
పచ్చ బ్యాచ్‌ రౌడీయిజం..

  • పల్నాడు..

  • నరసరావుపేటలో తెలుగుదేశం కార్యకర్తలు రౌడీయిజం

  • ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

  • కాలేజీ ఎదుట తెలుగుదేశం జెండాలు పట్టుకుని హడావిడి చేస్తున్న టీడీపీ నాయకులు

  • రిటైర్ డిఫెన్స్ ఉద్యోగితో గొడవపడి బలవంతంగా అతన్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన టిడిపి అభ్యర్థి అరవింద బాబు అనుచరులు

  • నారాయణరెడ్డి ఎదురు తిరగటంతో మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన అరవింద్ బాబు అనుచరులు

  • తెలుగుదేశం కిడ్నాప్ వ్యవహారాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
     

 

09:20 AM, May 6th, 2024
హీరో సాయిధరమ్‌ తేజ్‌పై దాడి జరగలేదు: డీఎస్పీ హనుమంతరావు

కాకినాడ

  • హీరో సాయి ధరమ్‌ తేజ్‌పై ఏలాంటి దాడి జరగలేదు.

  • సోషల్‌ మీడియా, కొన్ని ఛానెల్స్‌లో వస్తున్న ప్రచారం వాస్తవం కాదు

  • నిన్న తాటిపర్తిలో ప్రచారం చూడడానికి వచ్చిన వ్యక్తికి తగిలింది గాజు సీసా కాదు.

  • రాయితో  కొట్టినట్లు చెంపమీద గాయం అయ్యింది.

  • ఆయన ప్రచారం నుంచి వెళ్ళిపోయిన 15 నిముషాల తరువాత ఈ ఘటన జరిగింది.

  • దీనికి కారకులైన ఇద్దరు వ్యక్తులను  గుర్తించాం

  • అనుమతి లేకుండా ప్రచారాలు.. ర్యాలీలు చేసి గొడవలు సృష్టిస్తే ఆ రాజకీయ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

  • సోషల్‌ మీడియాలో సామాజిక భాద్యతతో వ్యవహరించాలి
     

 

08:30 AM, May 6th, 2024
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌.. సునీల్‌ కుమార్‌ వాహనంపై దాడి!

  • వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. 

  • వాహనాన్ని చుట్టుముట్టి అద్ధాలు ధ్వంసం చేశారు. 

  • ఏలూరులోని లింగపాలెం మండలం రంగాపురం వద్ద ఘటన జరిగింది. 

  • వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్‌ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడిక దిగాయి. 

  • టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని, సొంగ రోషన్‌ వర్గీయులే దాడి

  • రంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న సునీల్‌ కుమార్‌ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. 

  • సునీల్‌ కుమార్‌ వాహనాన్ని చుట్టిముట్టి టీడీపీ శ్రేణులు అద్ధాలను ధ్వంసం చేశారు. 

  • పచ్చమూకల దాడి నుంచి సునీల్‌ కుమార్‌, అతని అనుచరులు చాకచక్యంగా తప్పించుకున్నారు.

  • సునీల్‌ కుమార్‌ కామెంట్స్‌..

  • టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారు. 

  • రెండు కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. 

  • అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశాను. 

  • అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు. 

  • హుందాగా రాజకీయాలు చేయాలి. కానీ మా సహనాన్ని పరీక్షించకండి. 

  • ఓడిపోతున్నామనే భయంతోనే మాపై దాడులకు పాల్పడుతున్నారు.

  • దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారు. 

  • దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాము. 

  • వారు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి చర్యలను నియంత్రించాలి. 

  • ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకూడదు. 

  • తెలుగుదేశం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. 

  • టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోంది. 

  • ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అన్న రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నారు

 

07:20 AM, May 6th, 2024
టీడీపీకి ఝలక్‌..

  • టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన వైఎస్సార్‌సీపీ
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ చాలా మంచిదని అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్
  • పయ్యావుల వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి
  • చాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ సీఎం జగన్‌ మెచ్చుకున్న పయ్యావుల
  • 2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావుల
  • నేడు అదే చట్టం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు
  • చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో విస్తుపోతున్న రాష్ట్ర ప్రజలు

 

07:00 AM, May 6th, 2024
నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

  • నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
  • ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్‌సభ స్థానం రేపల్లెలో ప్రచార సభ
  • మధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం మాచర్లలో రోడ్‌ 
  • మధ్యాహ్నం మూడు గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్‌లో ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. 

 

06:50 AM, May 6th, 2024
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి..

  • ఆశలు వదులుకుంటున్న టీడీపీ
  • మైనార్టీ ఓట్లు పడవనే భయం
  • ఇప్పటికే బీజేపీని పూర్తిగా దూరం పెట్టిన వైనం
  • ప్రచారంలో ఎక్కడా కన్పించని కాషాయ కండువా
  • టీడీపీలో చేరాలని ప్రత్యర్థి  కార్పొరేటర్లు, నేతలకు వల
  • ఓటుకు రూ.2వేల చొప్పున పంచేందుకు సిద్ధం
     

06:40 AM, May 6th, 2024
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జల

  • చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు
  • ల్యాండ్‌ టైటిలింగ్‌  యాక్ట్‌  భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుంది
  • ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారు
  • సర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశఫెట్టాం
  • పోలవరాన్ని సీఎం జగన్‌ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉంది
  • కేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది
  • సీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 850 కోట్లు సేవ్‌ చేశారు
  • పోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్‌ షాకు తెలుసు
  • కావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలి
  • ఏ  బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుంది
  • కూటమిలో పార్ట్నర్‌ కాబట్టి అమిత్‌ షా ఏదో మాట్లాడారు
  • చంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారు
  • పోలవరం ప్రాజెక్ట్‌ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు
     

06:30 AM, May 6th, 2024
భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబు

  • వారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారు
  • మోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారు
  • దీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలి
  • లేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలి
  • జనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
  • ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు
  • ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారు
  • పేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్
  • ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్‌ది
  • చుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్
  • అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • టీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోంది
  • తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement