AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Politics And Election Live Updates On May 4th | Sakshi
Sakshi News home page

AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Sat, May 4 2024 7:07 AM | Last Updated on Sat, May 4 2024 9:28 PM

AP Politics And Election Live Updates On May 4th

Andhra Pradesh Election Updates 4th May...

08:25 PM, May 4th, 2024

ఫ్యాన్ గుర్తుపై ఓటేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు: ఎమ్మెల్యే వెల్లంపల్లి

  • ప్రజలు స్పందన చూస్తుంటే 175కు 175 స్థానాలు విజయం సాధిస్తాం
  • సెంట్రల్లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేగా నన్ను  గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • చంద్రబాబు మాయమాటలు చెప్పేవాడు తప్ప... ఎప్పుడూ ప్రజలకు మంచి చేసింది లేదు
  • 2014, 2019ల్లో  విభజించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసి పాత మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టాడు
  • సీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు
  • చంద్రబాబు మేనిఫెస్టోని కూటమినేతలే వ్యతిరేకిస్తున్నారు
  • చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోని వాళ్ల పార్టీ నేతలే నమ్మడం లేదు

08:21 PM, May 4th, 2024
కాకినాడ:

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారలపై స్పందించిన ఎన్నికల కమీషన్‌కు ధన్యవాదాలు:: కురసాల కన్నబాబు

  • సిఐడి త్వరగతిన విచారణ చేసి  దోషులను తేల్చాలి.
  • చంద్రబాబు రోజు రోజుకి దిగజారి పోతున్నాడు.
  • చంద్రబాబు ఓ అబద్దాల ఫ్యాక్టరీ.
  • అప్రమత్తంగా లేకపోతే ఎన్ని అబద్దాలైనా ప్రచారం చేస్తాడు.
  • ప్రజల మనస్సును గెలుచుకుని ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన లేదు
  • ప్రజలను అభద్రతా భావానికి గురిచేసి ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు ఆలోచన.
  • సిఎం జగన్‌తో చంద్రబాబుకు  ఎప్పటికీ పోలిక

08:13 PM, May 4th, 2024

తాడేపల్లి :

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం: సీఎం వైఎస్ జగన్

  • 4% ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో చంద్రబాబు ఒక పక్క జతకడతాడు.
  • మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమని నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు.
  • నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నా.. ఆరు నూరైనా మైనారిటీలకి 4 శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే.
  • ఇది మీ వైఎస్సార్‌ బిడ్డ జగన్‌ మాట
  • ముస్లింల రిజర్వేషన్ కోసం ఎందాకైనా పోరాడతా
  • మరి చంద్రబాబు ఇలా మోదీ సభలో చెప్పగలడా?
  • ఎన్డీయే నుంచి బయటికి రాగలడా?

   -

07:21 PM, May 4th, 2024

ఎన్టీఆర్ జిల్లా:

చంద్రబాబు గతంలో 650 హామీలు, ఇప్పుడు 6,500 హామీలు ఇచ్చాడు: ఎంపీ కేశినేని నాని

  • ఒక్క హామీని నెరవేర్చుతాడా చంద్రబాబు
  • చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయింది
  • 2024 ఎలక్షన్ అనంతరం తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లి పోవడానికి  చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు
  • చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడు కాబట్టి  టీడీపీని  టేకోవర్ చేసుకోవచ్చని బిజెపి కూటమితో జతకట్టింది
  • చంద్రబాబుపై  బీజేపీకి నమ్మకం లేదు
  • మేనిఫెస్టో రిలీజ్ చేస్తే పక్కన ఉండడానికి కూడా బీజేపీ ఇష్టపడలేదు
  • విశ్వసనీయత కలిగి చెప్పింది చేసే వ్యక్తి సీఎం జగన్‌
     

07:07 PM, May 4th, 2024

తాడేపల్లి :

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ అసత్య ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డి

  • వ్యవస్థల మీద నమ్మకం పోయేలాగ వ్యవహరిస్తున్నారు.
  • ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం
  • అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?
  • 14 యేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి  మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?
  • అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు
  • ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు
  • ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?
  • భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం
  • చట్టం తేవడం   ఒక విప్లవాత్మక మార్పు
  • ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ
  • టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు  భూముల అక్రమాలకు పాల్పడ్డారు
  • వెబ్ ల్యాండ్ పోర్టల్ లో మార్పులు చేసి ఎంతో మంది భూములను  ఇబ్బందులోకి నెట్టారు
  • సీఆర్‌డీఏ  పరిధిలోని  భూములను డీమ్డ్ మ్యూటేషన్‌  పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు
  • సాధ బైనమా పేరుతో భూములు కొల్లగొట్టారు
  • అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు
  • అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు
  • తన అనుకూలమైన వారికి భూములు చంద్రబాబు కట్టబెట్టారు
  • లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది
  • కబ్జాలకు అలవాటు పడిన వాళ్ళకి సంస్కరణలు నచ్చవు
  • సమగ్ర భూ సర్వే పూర్తి  అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
  • కబ్జాలకు,అక్రమాలకు,అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుంధని చంద్రబాబు భయపడుతున్నారు
  • భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం
  • అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా
  • 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం
  • భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్ర బాబు జీర్ణించుకోలేక పోతున్నారు
  • 6వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది
  • రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు
  • చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు
  • పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేసాము
  • పుస్తకాలపై సీఎం జగన్‌ ఫోటో వేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి?
  • రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?.
  • ల్యాండ్ టైట్లింగ్‌  చట్టాన్ని  రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే.
  • సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది
  • ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం
  • చట్టం అమలు అవ్వాలి అంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది
  • కొవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం
  • ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాము
  • ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి
  • వ్యవస్థలను అడ్డం పెట్టుకొని  చంద్రబాబు చేస్తున్నది  దేశ ద్రోహం కంటే నేరం

06:05 PM, May 4th, 2024

టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్

  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు.
  • కొద్దిరోజులుగా ఐివీఆర్ఎస్ కాల్స్ ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ.
  • దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ.
  •  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.
  • విచారణ జరపమని సీఐడీని ఆదేశించిన ఎన్నికల సంఘం.
  • తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశం.
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చేస్తున్న ప్ర‌చారంపై ఈసీకి  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు పిర్యాదు .
  • ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్న వైఎస్సార్‌సీపీ బృందం
  • ప్ర‌భుత్వంపై ఫేక్ ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆధారాలు అందచేసిన వైఎస్సార్సీపీ బృందం
  • ఎన్నిక‌ల కోడ్‌కు  విరుద్దంగా టీడీపీ ప్ర‌చారం చేస్తున్న‌ట్లు గుర్తించిన ఈసీ.
  • ఫిర్యాదుపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన అడిష‌న‌ల్ సీఈవో హ‌రేంధిరియ ప్ర‌సాద్.

06:05 PM, May 4th, 2024

తాడేపల్లి :

  • వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లిం మైనారిటీల జేఏసీ నేతలు
  • ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు
  • సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్
  • ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారు
  • ముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారు
  • వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారు
  • వైసీపి డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారు
  • సీఏఏ, ఎన్.ఆర్సి, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చింది
  • దేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు
  • ఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చాం
  • రాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాం
  • ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పింది
  • చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?
  • ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలి
  • దీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలి
  • వైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్

నసీర్ అహ్మద్, మత పెద్ద కామెంట్స్

  • ముస్లింలకు అండగా నిలుస్తామని వైసీపి నేతలు చెప్పారు.
  • మా సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు.
  • వైఎస్సార్‌సీపీ మొదటి నుంచీ మాకు అండగా నిలిచింది.

మునీర్ అహ్మద్, ముస్లిం మతపెద్ద

  • ముస్లింలు వెనుకపడి ఉన్నారని వైఎస్సార్ గుర్తించారు
  • అందుకే రిజర్వేషన్ లు కల్పించారు
  • దానివలన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు
  • చంద్రబాబు మా విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారు
  • ఇలాగే ఉంటే మళ్ళీ ప్రజలు తగిన బుద్ది చెప్తారు
  • సీఎం జగన్ సంక్షేమ పథకాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి

హుస్సేనీబాబా, ముస్లిం మతపెద్ద కామెంట్స్

  • ముస్లింల అపోహలన్నీ వైసీపి మన ఏతలు తొలగించారు
  • వచ్చే ఎన్నికలలో రెండు ఓట్లు వైసీపికి వేయాలి
  • 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తాం

5:55 PM, May 4th, 2024

నెల్లూరు , ప్రచారసభలో  సీఎం వైఎస్ జగన్‌ స్పీచ్

  • గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు టోఫెల్‌, IB దాకా అంతర్జాతీయ విద్య వరకూ పిల్లల చదువుల్లో విప్లవాలు తెచ్చాం. 
  • నాడు నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, 6వ తరగతి నుండే డిజిటల్‌ బోర్డులు, డిజిటల్ బోధన, బైజ్యూస్‌ కంటెంట్, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ క్లాసులు, బైలింగ్వల్‌ టెక్స్ట్‌బుక్స్‌ 
  • క్వాలిటీ చదువులు, సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఇది కాదా అభివృద్ధి
  • వెలిగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్‌ బాధితులతో అతలాకుతలం అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు.
  • వెలిగొండ రెండు టన్నెళ్లు పూర్తిచేసాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువస్తున్నాం.
  • నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తి చేసి జాతికి అంకితం చేశాం.
  • చిత్రావతీ రిజర్వాయిర్, గండికోట రిజర్వాయిర్‌, పులిచింతల రిజర్వాయిర్‌ లలో R&R పూర్తి చేసి డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతున్నాం.

5:25 PM, May 4th, 2024

తాడేపల్లి :

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లి మైనార్టీల జేఏసీ నేతలు
ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు

అనంతరం సజ్జల మాట్లాడుతూ..

  • ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారు
  • ముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారు
  • వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారు
  • వైఎస్సార్‌సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారు
  • సీఏఏ, ఎన్‌ఆర్సీ, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చింది
  • దేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు
  • ఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చారు
  • రాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాం
  • ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పింది
  • చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?
  • ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలి
  • దీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలి
  • వైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్
     

5:10 PM, May 4th, 2024

విశాఖ :

గంటా శ్రీనివాస్ కాపు ద్రోహి: 
తోట రాజీవ్, కాపునాడు అధ్యక్షుడు, విశాఖ

  • రియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎన్నికలకు గంటా వాడుకుంటున్నారు
  • గంటా పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చెయ్యడు
  • అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడు
  • గంటా ఏ నాడూ చట్ట సభలకు వెళ్ళింది లేదు
  • గంటాకు పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  • గంటా మాకు అవసరం లేదని భీమిలి ప్రజలు అంటున్నారు
  • గంటా మంత్రిగా ఉండి విశాఖకు ఏం చేశాడు
  • గంటాను పవన్ కళ్యాణ్ పలుమార్లు తిట్టాడు
  • అలాంటి గంటాకు ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు
  • నోటికాడ కూడు లాక్కోవడం గంటాకు అలవాటు
  • గంటా రాజకీయ బంధిపోటు దొంగ
     

3:46 PM, May 4th, 2024

నన్ను అంతమొందించే ప్రయత్నం సీఎం రమేష్ చేస్తున్నారు: బుడి ముత్యాల నాయుడు

  • తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారు
  • నా ఇంటి మీద డ్రోన్ ఎగరేయవలసిన అవసరమేముంది?
  • డ్రోన్‌తో నా కదలికలను పరిశీలిస్తున్నారు
  • రౌడీయిజం గుండాయిజం చేయాలని సీఎం రమేష్ చూస్తున్నారు
  • ప్రజాక్షేత్రంలో తనపై గెలవలేనని చెప్పి నన్ను అంతమొందించే కుట్రలు చేస్తున్నారు
  • వచ్చిన వారు కూడా సీఎం రమేష్ పంపితేనే వచ్చామని చెబుతున్నారు
  • సీఎం రమేష్ చెబితేనే డ్రోన్ తో విజువల్స్ తీశామని వచ్చిన వారు చెబుతున్నారు
  • వారు మా ప్రాంతానికి చెందిన వ్యక్తుల కాదు
  • ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో రెక్కీ నిర్వహించాల్సిన అవసరమే ఉంది

3:15 PM, May 4th, 2024

పలమనేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌

  • ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?
  • మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం
  • కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు
  • 14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?
  • అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు..
  • అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడు
  • బాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా?
  • ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం
  • మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాం
  • మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం
  • 59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ
  • ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి
  • చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే
  • మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది
  • గ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయి
  • వర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా
     

2:50 PM, May 4th, 2024

విజయవాడ

మేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం: దేవినేని అవినాష్
విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌లో వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌

  • 10ఏళ్లలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.. అనేక అనుభవాలు నేర్పింది
  • తూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు చేయలేని అభివృద్ధి పనులు చేశాం..
  • 2వ డివిజన్ నుండి 22 వ డివిజన్ వరకు అన్ని పనులు చేశాం

  • టీడీపీ అధికారంలో ఉండి, మేయర్ ప్రజా ప్రతినిధులు అన్ని ఉన్నా అభివృద్ధి శూన్యం
  • కొండ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాం
  • 2019, 2020లో వరదలు వచ్చాయి
  • కృష్ణ లంక కరకట్ట ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పూర్తిచేశాం
  • రూ. 150 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చాం
  • మేము చేసిన పనిని టీడీపీ వాళ్ళు చేసారని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? వీడియోలు ఎలా తీయించుకోగలుతున్నారు?
  • గద్దె రామ్మోహlన్‌రావు ఒక అసమర్థ ఎమ్మెల్యే
  • కేవలం మాటలు, షో రాజకీయాలతో ప్రజలను గద్దె మోసం చేశాడు
  • వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లు గెలిచిన చోట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు
  • మేము ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారా అని చూడలేదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం
  • 4 సంవత్సరాల కాలంలో ప్రతి గడపను 4 సార్లు తిరిగాను
  • టీడీపీ ఒక్కసారి కూడా ప్రజల గడప తొక్కలేదు
  • రోడ్లు, మంచినీళ్లు, పార్కు లు ,డ్రైనేజ్ నిర్మించామని ప్రజలే చెపుతున్నారు.. ఇదే గా అభివృద్ధి
  • - ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న అభివృద్ధికి అడ్డాగా తూర్పు నియోజకవర్గాన్ని చూపిస్తాం

2:42 PM, May 4th, 2024

అనంతపురం:

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భగ్గుమన్న టీడీపీ అసమ్మతి

  • టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణ
  • ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాస
  • పరస్పరం వాగ్వాదం, తోపులాటకు పాల్పడ్డ ఇరువర్గాలు
  • టిక్కెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తి గా ఉన్న   మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు
     

1:00 PM, May 4th, 2024

చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్

  • చంద్రబాబుపై జోగి రమేష్‌ సీరియస్‌ కామెంట్స్‌
  • రాజకీయ హాంతకుడు బాబు.
  • డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.
  • ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.
  • ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.
  • అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.
  • చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.
  • బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.
  • రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.
  • కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.
  • మంచి చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.
  • ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
     

 

12:40 PM, May 4th, 2024
బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ!
 

  • బీజేపీ నేతల ఓవరాక్షన్‌..
  • డ్రోన్‌తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.
  • అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.
  • పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.
  • విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.
  • పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.
  • నిందితులను విచారిస్తున్న పోలీసులు.
  • విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు.
  • సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులు
  • దేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
  • ముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులు
  • డ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులు
  • ముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు
     

 

12:20 PM, May 4th, 2024
సుజనా చౌదరికి వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్‌..

  • కేశినేని నాని కామెంట్స్‌

  • మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 

  • 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?

  • రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?.  

  • పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారు

  • అసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థి

  • చంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.

  • విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?

  • డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.

  • పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.

  • జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే.

 

12:00 PM, May 4th, 2024
గద్దెకు దేవినేని కౌంటర్‌
 

  • దేవినేని అవినాష్‌ కామెంట్స్‌..

  •  జగన్‌ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.

  • రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైంది

  • కరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలు

  • ప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారు

  • టీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు

  • టీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్‌ మా పార్టీ నేతలు లేరు

  • 670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగింది

  • గంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.

  • విశాఖలో దొరికిన డ్రగ్స్‌కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయి

  • నిజానిజాలు వెలికితీయాలి

  • జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.

  • చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కే దక్కుతుంది

  • అసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు

 

11:20 AM, May 4th, 2024
బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన

  • టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.

  • 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. 

  • కోట్ల సూర్యప్రకాశ్‌ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. 

  • పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.

  • ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? 

  • అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. 

  • ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. 

  • ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌కి సమర్పించాం. 

  • అప్లికేషన్‌లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్‌ అవుతుందా?. 

  • నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. 

  • రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? 

  • స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. 

  • డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. 

  • మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు.

 

 

10:40 AM, May 4th, 2024
బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయి

  • మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. 

  • నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదు

  • మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. 

  • ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్‌లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. 

  • బ్యాంకుల్లో పెన్షన్‌ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. 

  • బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. 

  • పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.

 

 

9:20 AM, May 4th, 2024
మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం!
 

 

  • ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌

  • మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ కామెడీ ట్రాక్‌

  • మే 13న పోలింగ్‌ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్‌

  • లోకేష్‌ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు

 

8:50 AM, May 4th, 2024
చంద్రబాబు మరో కుట్ర..

  • టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్ర

  • పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డు

  • ఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలు

  • బ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులు

  • తాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డు

  • ఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలే

  • ఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘం

  • ఇప్పటికే అనేకసార్లు ఎన్నికల‌ సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వం

  • టీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ
     

7:45 AM, May 4th, 2024
ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్‌..

  • ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలు

  • వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలు

  • ప్రచారాలలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు

  • సీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్‌ వివాదాస్పద ‍వ్యాఖ్యలు.

  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలు

  • మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులు

  • దెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడి

  • చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.

  • అదే సమయంలో ప్రచార రథం ధ్వంసం

  • మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.

  • ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • సీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయం

  • అందుకే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం
     

 

7:00 AM, May 4th, 2024
నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

  • నేడు  పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

  • నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్

  • సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం

  • మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్

  • మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.

  • మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి  3.50 గంటలకు  నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్

  • మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు.

 

6:45 AM, May 4th, 2024
ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నాని

  • చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదు

  • అందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.

  • చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టో

  • అందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి  కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదు

  • రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు

  • ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయం

  • టీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్లిపోతారు

  • ఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది

  • దేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్

  • ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య

 

6:30 AM, May 4th, 2024
జూనియర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నాని

  • గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం

  • ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

  • జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలి

  • పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ

  • అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాము

  • పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు

  • అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరు

  • పదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... 

  • ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం

  • మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు

  • అభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారు

  • ఎన్టీఆర్‌ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి

  • చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. 

  • పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి వస్తాయి

  • ఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను  వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారు

  • పెద్ద ఎన్టీఆర్‌కు  దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్‌ మీడియాలో తిట్టిస్తున్నారు

  • నేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. 

  • నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.

  • నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్‌ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.

  • ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారు

  • ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ నాకు రెండు కళ్లు

  • తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.

  • సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.

  • ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement