సాక్షి, నెల్లూరు: టైమ్స్ నౌ, నవభారత్ సర్వేల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందని ప్రకటించడంతో రాష్ట్రంలో టీడీపీ బలం బహిర్గతమైందని, చంద్రబాబు తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోయారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ను వదిలేసి చంద్రబాబు తన దత్తపుత్రుడిపై ఆశలు పెట్టుకున్నారని.. ఆ ఫ్రస్ట్రేషన్‌లో లోకేశ్ పిచ్చికూతలు కూస్తున్నాడని, తండ్రిపై కోపాన్ని వైఎస్సార్‌సీపీ నేతలపై చూపుతున్నాడని ఆరోపించారు.
అసలు లోకేశ్ పాదయాత్రను చంద్రబాబే లైట్‌గా తీసుకున్నారని.. దీంతో లోకేశ్ అభద్రతా భావంతో ఉన్నాడన్నారు. తన తాతకే వెన్నుపోటు పొడిచిన తండ్రికి తాను ఓ లెక్కా అని లోకేశ్ భయపడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. తనకు ప్రజాదరణ లేదు కాబట్టే చంద్రబాబు దత్తపుత్రుడిపై ఆశలు పెట్టుకున్నాడన్న భయం లోకేశ్‌లో కనిపిస్తోందని చెప్పారు. దత్తపుత్రుడి సభలకు ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వాలని అనుకూల మీడియాకు చంద్రబాబు ఆదేశాలిస్తూ కొడుకును పట్టించుకోవడంలేదన్నారు. దీంతో.. ఏదో ఒకటి మాట్లాడితే మీడియాలో చూపిస్తారనే లోకేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి తరలింపు..
సర్వేపల్లి నియోజకవర్గంలో పాదయాత్రకు ఇతర నియోజకవర్గాల నుంచి జనాన్ని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రి ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల పసుపు కుంభకోణంలో ఇరుక్కున్న టీడీపీ నేతలు తప్పించుకోగా అధికారులు మాత్రమే బలయ్యారని ఆయన గుర్తుచేశారు. నాన్ ఫిషర్‌మ్యాన్ ప్యాకేజ్ కోర్టు వారికి సంబంధంలేదని.. కోర్టువారితో ఇప్పిస్తానని లోకేశ్ చెప్పడం ఆయన అవగాహనారాహిమన్నారు. మత్స్యకారులు నిలదీస్తారనే వారితో సమావేశాన్ని రద్దుచేశారన్నారు.
నాన్ ఫిషర్‌మ్యాన్ ప్యాకేజ్‌నువైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకే అందించామని కాకాణి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఏవైనా సమస్యలుంటే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి సుపరిపాలనను చూసిన ప్రజలు.. చంద్రబాబును మరోసారి తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇది కూడా చదవండి: 10 నెలల్లో ఎన్నికలు.. అభ్యర్థికే దిక్కులేదు.. భవిష్యత్తుకు గ్యారెంటీనా?
Comments
Please login to add a commentAdd a comment