బోధన్: ‘కాంగ్రెస్ నాయకుల తిరగబడటం, తరిమికొట్టడం లాంటి మాటలు ఇక్కడ నడవవు.. గులాబీ కండువా కప్పుకొని లక్షలాదిగా మా కార్యకర్తలు తిరగబడితే ప్రజా క్షేత్రంలో మీరెక్కడా తిరగలేరు.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో లేనోళ్లు, ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వనోళ్లు మాపై నోటికొచ్చి నట్టు మాట్లాడుతున్నారని ఆమె విపక్షాలను విమర్శించారు.
బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ మైదానంలో ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమెర్ నేతృత్వంలో నియోజకవర్గ స్థాయి బూత్‌కమిటీ సభ్యుల భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కవిత ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని వేదికపై ఏర్పాటు చేసిన నగారాను (డోలు) ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి మోగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కవిత ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రను ప్రస్తావిస్తూ.. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని చెప్పుకొస్తున్నారని, కానీ తెలంగాణలో సమర్థుడైన లీడర్ కేసీఆర్ హయాంలో శాంతి భద్రతలు, మత సామరస్యతకు ఎలాంటి ఢోకాలేదన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment