
సాక్షి, విజయవాడ: తనతో బహిరంగ చర్చకు వచ్చే అర్హత లోకేష్‌కు లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా ఓడిపోయినోడితో నాలుగు సార్లు ఎమ్మెల్యేనైన నేను చర్చించడమేంటి అని ప్రశ్నించారు.
‘‘మా ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం ప్రతి ఇంటికి ఇస్తున్నాం. బండ బియ్యం తిన్న బడుద్దాయి నారా లోకేష్ నన్నేదో చేస్తామని టీడీపీ వాళ్లు చేతకాని ప్రకటనలు ఇస్తున్నారు. టీడీపీలో ఎవడు నా బొచ్చు కూడా పీకలేరు. లోకేష్ యాత్రలో ఎన్ని అడుగులేస్తే టీడీపీ అంత పాతాళానికి వెళ్తుంది. పోలీసుల బూట్లు తుడవడానికి కూడా లోకేష్ పనికిరాడని కొడాలి నాని దుయ్యబట్టారు.
చదవండి: మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతల దాడి
Comments
Please login to add a commentAdd a comment