సాక్షి, కృష్ణా: వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్‌లో చిరంజీవి చేసిన పొలిటికల్ కామెంట్లకు గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ‘సినీ పరిశ్రమలో చాలామంది పకోడీగాళ్లున్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో ఆ పకోడీగాళ్లు కూడా సలహాలు ఇస్తున్నారంటూ సెటైర్లు వేశారాయన.
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది పకోడీగాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహా ఇస్తున్నారు. అలాంటి వాళ్లు తమ వాళ్లకు(పవన్‌ను కూడా ఉద్దేశించి..) కూడా సలహాలిస్తే బాగుంటుంది. ‘‘మనకెందుకురా బాబూ రాజకీయాలు.. మన డ్యాన్సులు, మన ఫైట్లు మనం చూసుకుందాం’’ అని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదంటూ చురకలంటించారాయన.
ఆ రోజు ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు..
చంద్రబాబుపై కొడాలి నాని మండిపడ్డారు. అత్యధిక భాగం ఈ రాష్ట్రాన్ని నడిపింది చంద్రబాబే కదా.. ఆ రోజు ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయాడని ప్రశ్నించారు కొడాలి నాని. తెలంగాణలో మహబూబ్ నగర్ ను దత్తత తీసుకుంటానని చెప్పి ఎందుకు గాలికొదిలేశాడు. 27 సంవత్సరాల్లో చంద్రబాబు గుడ్డిగుర్రం పళ్లు తోమాడా?, ఈ రాష్ట్రంలో జలయజ్ఞం చేపట్టిన వ్యక్తి వైఎస్సార్. గడచిన పదేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఎవడి సంక నాకారు. చంద్రబాబు ఒక 420. పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు ఉచ్చపోసుకుంటున్నాడు.పెద్దిరెడ్డిని ఎలాగైనా డ్యామేజ్ చేయాలనేదే చంద్రబాబు ప్రయత్నం.
రాబోయే ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలడం ఖాయం...చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయం. బయటి జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చి పుంగనూరులో చంద్రబాబు గొడవ చేయించాడు. చంద్రబాబు మాదిరి మాకు సెల్ఫీల అవసరం లేదు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు. 2024 తర్వాత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment