బీఆర్‌ఎస్, బీజేపీల అడ్రస్ గల్లంతవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్, టీడీపీ నేతలు
పాల్గొన్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీ పట్నం
సాక్షి, మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీలో గెలి పించాలని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపుని చ్చారు. గతంలో తనకు వచ్చిన మెజారిటీ కంటే మరింత భారీ ఆధిక్యం సాధించి మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీ జెండాను మరోమారు ఎగురవేయాలని ఆయన కోరారు. బుధవారం హైద రాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎల్బీనగ ర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్, టీడీపీతో పాటు పలువురు కమ్మ సంఘం నాయ కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చిన నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపో తోందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జన తాపార్టీ, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌లకు మల్కాజిగిరిలో ఉనికి లేకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డా.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలవ లేవని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో తమకు అడ్రస్ లేకుండా పోతుందనే భయంతో బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీలో చేరిన వారిలో గతంలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కృష్ణ ప్రసాద్, తెలంగాణ కమ్మ సంఘం నాయకులు బి.రవిశంకర్, అరికెపూడి ప్రసాద్ (మేడ్చల్), కుత్బుల్లాపూర్‌కు చెందిన బోడు వెంకటేశ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శాలిని, పావనిరెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎంపీపీ సి.దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment