
పేద పిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
సాక్షి, అమరావతి: పేద పిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమ పథకాలను అడ్డుకోలేవన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధిస్తామంటే అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆయన దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాలపై కూడా కోర్టుకెళ్లిన సంస్కృతి టీడీపీదని మండిపడ్డారు. దళితులపై దాడులు జరిగితే సీఎం తక్షణమే స్పందిస్తున్నారన్నారు. రాజకీయాల కోసం లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.
చదవండి: సత్వరమే స్పందించినా రాజకీయమా?