సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా సీరియస్ అయ్యారు. పవన్ కల్యాణ్ దళపతి కాదు.. దళారి అంటూ ఫైరయ్యారు. కాపులు, కార్యకర్తలకు పవన్ క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు కోసం పవన్ ఢిల్లీలో దళారిగా మారాడని ఎద్దేవా చేశారు.
కాగా, మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లిని తిట్టినవాడి కోసం పవన్ కల్యాణ్ దళారిగా మారడం సిగ్గుచేటు. కాపులు, కార్యకర్తలకు పవన్ క్షమాపణలు చెప్పాలి. సిగ్గులేకుండా మూడు పార్టీలతో కలిసి పోటీచేస్తామని పవన్ అంటున్నాడు. ప్రధాని మోదీని తిట్టిన చంద్రబాబుని ఎన్డీయే సమావేశానికి పిలవలేదు. కానీ, తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ కలిసిపోయాడు.
పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక పవన్ మళ్లీ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని ఎద్దేవా చేశారు. ఆనాడు ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోను.. గొంతు కోసుకుంటా అన్నాడు. ఇప్పుడేమో పొత్తులు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నాడు. చంద్రబాబు ఎన్ని లేఖలు రాసినా ఎన్డీయే సమావేశానికి పిలుపురాలేదు. చంద్రబాబు ఎంత ఊసరవెల్లో బీజేపీకి బాగా తెలుసు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానన్న బాబు.. కాంగ్రెస్‌ను కూడా మోసం చేశాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: మిగతా రాష్ట్రాలకు సీఎం జగన్ దిక్సూచి
Comments
Please login to add a commentAdd a comment